అడ్వాన్స్డ్ ఫీచర్స్ తక్కువ రేట్..! మార్కెట్లోకి శాంసంగ్‌ ఎం మొబైల్స్‌…!

ఒకప్పుడు ఫోన్లంటే నోకియానే. నోకియా క్రేజ్ తగ్గిపోయిన తర్వాత.. శాంసంగ్‌ దే హవా. రానురాను శాంసంగ్‌ క్రేజ్ కూడా తగ్గుతూ వస్తుంది. అయినా…వివో, ఒప్పో, రెడ్ మీ లాంటి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల మార్కెట్ ను ధీటుగా ఎదుర్కొంటోంది శాంసంగ్‌. దాంట్లో భాగంగానే శాంసంగ్‌ ఎం సిరీస్‌ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లు లాంచ్‌ అయ్యాయి. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న గెలాక్సీ ఎం 10, గెలాక్సీ ఎం 20 స్మార్ట్‌ఫోన్లు సోమవారం అధికారంగా విడుదలయ్యాయి. డ్యుయల్‌ కెమెరా సెటప్‌, ఇన్‌ఫినిటీ వి డిస్‌ప్లే తో వీటిని తీసుకొచ్చింది. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి  ప్రత్యేకంగా అమెజాన్‌, శాంసంగ్‌ ఈ స్టోర్‌ ద్వారా ఈ డివైస్‌లు దొరుకుతాయి.

గెలాక్సీ ఎం10ను రెండు వేరియంట్లలో లాంచ్‌ చేసింది శాంసంగ్. 2జీబీ ర్యామ్‌/16జీబీ స్టోరేజ్‌ వెర్షన్‌ ధరను రూ.7990గా నిర్ణయించగా, 3జీబీ ర్యామ్/32జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధరను రూ.8990గా ఉంచింది. గెలాక్సీ ఎం 20 కూడా రెండు వెర్షన్‌లలొ అందుబాటులోకి తీసుకు వచ్చింది. 3జీబీ ర్యామ్‌/32జీబీ స్టోరేజ్‌ వెర్షన్‌ ధర రూ.10,990 గానూ, 4జీబీ ర్యామ్‌/64జీబీ స్టోరేజ్‌ వెర్షన్‌ ధర రూ. 12,990గా ఉంది.

శాంసంగ్‌ గెలాక్స్‌ ఎం 10 ఫీచర్లు

  • 6.2 అంగుళాల  డిస్‌ప్లే
  • 720×1520 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
  • ఎక్సినాస్‌ 7870 సాక్‌​
  • ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో
  • 13+5 ఎంపీ డ్యుయల్‌ రియర్‌  కెమెరా
  • 5 ఎంపీ సెల్పీ కెమెరా
  • 3400 ఎంఏహెచ్‌ బ్యాటరీ

శాంసంగ్‌ గెలాక్సీ ఎం20 ఫీచర్లు

  • 6.3 అంగుళాల  డిస్‌ప్లే
  • 1080×2340 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
  • ఎక్సినాస్‌ 7904 సాక్‌​
  • ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో
  • 13+5 ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా
  • 8 ఎంపీ సెల్పీ కెమెరా
  • 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫాస్ట్‌ చార్జింగ్‌

ఈ ఫోన్లకు లాంచింగ్ ఆఫర్‌ కూడా ఉంది. జియో ద్వారా ప్రత్యేక లాంచింగ్‌ ఆఫర్‌ కూడా ఉంది.  రూ.198లకు జియె ప్యాక్‌పై డబుల్‌ డేటా ప్రయెజనాలను అందిస్తోంది. రోజుకు 4జీబీ డేటా చొప్పున 10 నెలలు పాటు ఉచితంగా అందించనుంది. ఈ ఆఫర్‌తో జియో వినియోగదారులకు రూ.3110ల అదనపు ప్రయోజనం లభించనుందని శాంసంగ్‌ వెల్లడించింది.   

LEAVE A REPLY