బిగ్ బాస్ సీజన్ – 5 కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే….

బిగ్ బాస్ సీజన్ – 5 కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే….

బుల్లితెరపై బిగ్ బాస్ క్రేజ్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. బిగ్ బాస్ నడుస్తున్న మూడు నెలలు టీవీ ప్రేక్షకులకు పండగే. ఈ షో కోసం ప్రతి ఏడాది ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తారు. అంతటి ఆధరణ పొందిన ఈ రియాలిటీ షో, ఇప్పటికే నాలుగు సీసన్స్ పూర్తి చేసుకుని 5వ సీసన్ కి రెడీ ఐయింది. అయితే…ఈ సీజన్ ఏప్రిల్ ప్రారంభమయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ప్రేక్షకుల అంజనాలకు ఏ మాత్రం తగ్గకుండా స్టార్ మా ఛానల్ నా భూతొ నా భవిష్యతి రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇక ఈ సీసన్ లో పాల్గొనబొయ్యే కంటెస్టెంట్స్ ను సెలక్ట్ చేసే పనిలో ఉంది బిగ్ బాస్ టీమ్. ఇప్పటికే ముగ్గురిని సెలక్ట్ చేసినట్లు… సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. వారిలో ఒకరు హైపర్ ఆది. రియాలిటీ షోష్ యాంకరింగ్ తో పాటు… సినిమా ఇండస్ట్రీలో మనోడు మాంచి కమెడీయన్. బొచ్చెడు ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. హైపర్ ఆదిని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకోవడానికి బీబీ టీం తీవ్రంగా కృషి చేస్తోందట. ఇప్పటికే హైపర్ ఆది తో వీళ్ళు చర్చలు కూడా జరిపినట్టు సమాచారం.

హైపర్ ఆదితో పాటు.. మరో యాంకర్ రవిని కూడా సంప్రదించారట బిగ్ బాస్ టీమ్. అయితే…రవికి భారీ పారితోషికం కూడా ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. కానీ…రవి సైడ్ నుంచి ఇంకా ఎస్ ఆర్ నో ఆన్సర్ రాలేదట. వీరిద్దరితో పాటు మరో ఫీమేల్ యాంకర్ విష్ణుప్రియ కూడా హౌస్ లోకి వెళ్తున్నట్లు సమాచారం. షో ఏదైనా తమ అందంతో ఫుల్ గ్లామర్ తెస్తుంది ఈ అమ్మడు. అంతేకాదు…అద్భుతమైన డాన్స్ శెయ్యగలదు. అందుకనీ…హౌస్ కాస్తా గ్లామర్ షో ఇవ్వడానికి విష్ణుప్రియను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

ఇక యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ ని కూడా బిగ్ బాస్ మందలించాడట. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ మరియు కవర్ సాంగ్స్ తో షణ్ముఖ్ ఎంత పాపులర్ అనేది మన అందరికి తెలిసిందే. ఈ మధ్యే ఈయన చేసిన సాఫ్ట్ వేర్ డెవలపర్ అనే వెబ్ సిరీస్ ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతానికి ఈ మూడు పేర్లే సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుంది. మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందీ అనేది తెలియాలంటే…ఇంకొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.