బిగ్ బ్రేకింగ్ : 7 లక్షల మందికి కరోనా టెస్టులు

బిగ్ బ్రేకింగ్ : 7 లక్షల మందికి కరోనా టెస్టులు

  10 Apr 2020

మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ధారావి ఒకటి. ముంబై లో ఉన్న ఈ ధారావిలో దాదాపు పది లక్షలకు పైనే జనం ఉంటారు. ఇప్పుడు ఈ ప్రాంతంలో కరోనా విస్తరించడం కలకలం రేగుతోంది. ధారావిలో నివసిస్తున్న వారిలో ఇప్పటికే 22 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో దాదాపు 7 లక్షల మందికిపై కరోనా టెస్టులు నిర్వహించాలని సంచలన నిర్ణయం తీసుకుంది మహారాష్ట్ర ప్రభుత్వం.

ఎంతో ఇరుకుగా, అపరిశుభ్రంగా ఉండే ఈ ప్రాంతంలో కరోనా మరింత వేగంగా విస్తరించే అవకాశాలు ఉండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. కనీసం 7 లక్షల మందికి కరోనా పరీక్షలను నిర్వహించాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నిర్ణయించారు. ఈ ప్రాంతంలో నివాసముండే 50 మంది తబ్లిగ్ జమాత్ సమావేశానికి కూడా వెళ్లొచ్చారు. మరోవైపు ముంబై అగ్నిమాపక శాఖ సిబ్బంది ధారావి ప్రాంతాన్ని శానిటైజ్ చేస్తున్నారు. ఒకవేళ ధారావిలో గానీ కరోన వేగంగా విస్తరిస్తే… ఇండియాలో కరోనా మూడవ స్టేజికి వెళ్లే ప్రమాధముంటుందని ఆందోళన చెందుతున్నారు నిపుణులు.