మా వాళ్లను ఆదుకోండి… చంద్రబాబు లేఖలు

మా వాళ్లను ఆదుకోండి… చంద్రబాబు లేఖలు

  10 Apr 2020

లాక్ డౌన్ వల్ల గుజరాత్ లో చిక్కుకుపోయిన 4 వేల మంది తెలుగువారిని ఆదుకోవాలని… గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాలాకు లేఖలు రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన మత్స్యకారులు గుజరాత్ లోని సోమనాథ్ జిల్లాలో చిక్కుకుపోయారని తెలిపారు. వారి యోగ క్షేమాల కోసం కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళన చెందుతున్నారని లేఖలో వివరించారు బాబు.

లాక్ డౌన్ ముగిసేంత వరకు వారికి గుజరాత్ లో ఆహారంతో పాటు వసతి సదుపాయాన్ని కల్పించాలని చంద్రబాబు కోరారు. నిత్యావసరాలను అందించాలని, వైద్య సదుపాయాలను కూడా కల్పించాలని విన్నవించారు. దీంతో పాటు 4 వేల మందికి ప్రాతినిథ్యం వహిస్తున్న 11 మంది ఫోన్ నంబర్లను లేఖలో జత చేసి పంపించారు.