హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగిసింది. మధ్యాహ్నం మూడు గంటలతో నామినేషన్ల గడువు ముగిసింది. ఇప్పటికే ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
టీఆర్ఎస్ – సైదిరెడ్డి
కాంగ్రెస్ – పద్మావతి రెడ్డి
బీజేపీ – రామారావు
టీడీపీ – చావ కిరణ్మయి
వీరితో పాటు చాలామంది నిరసనకారులు హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేశారు. చివరి రోజు నామినేషన్లు దాఖలు చేసేందుకు 89 మంది టోకెన్లు తీసుకోగా.. 60 మందికి పైగా నామినేషన్లు దాఖలు చేసినట్టు సమాచారం.
అప్పుడు నిజామాబాద్.. ఇప్పుడు హుజూర్ నగర్
పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి రైతులు, నిరసనకారులు భారీఎత్తున నామినేషన్లు దాఖలు చేసి, అధికార పార్టీ అభ్యర్థిని ఓడించిన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు హుజూర్ నగర్ లో కూడా పెద్ద సంఖ్యలో నిరసనకారులు నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల సంఘం నాయకుడు, పోడు భూముల సమస్యలు ప్రభుత్వానికి తెలియజేసేందుకు పలువురు రైతులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇక సర్పంచ్‌ల సమస్యలు తెలియజేసేందుకు పలువురు సర్పంచ్ సంఘం నాయకులు నామినేషన్లు దాఖలు చేసినట్టు సమాచారం.
ప్రచారంపై ఫోకస్
నామినేషన్ల పర్వం ముగియడంతో…ప్రధాన పార్టీలన్నీ ప్రచారంపై ఫోకస్ చేశాయి. ఇవాల సాయంత్రం 6 గంటలకు కాంగ్రెస్ బహిరంగ సభ ఉంది. మరో రెండు రోజుల్లో సీఎం కేసీఆర్ హుజూర్ నగర్‌లో జరగబోయే టీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొనే ఛాన్సుంది. టీడీపీ, బీజేపీలు కూడా వాటివాటి ప్రచారాలు అవి మొదలెట్టేశాయి.