లిప్ లాక్, ఎక్స్ పోజింగ్ చేయమంటున్నారు…. అందుకే…..

లిప్ లాక్, ఎక్స్ పోజింగ్ చేయమంటున్నారు…. అందుకే…..

  10 Apr 2020

తెలుగు టీవీ ప్రేక్షకులకు శ్రీముఖి తెలియని వాళ్లుండరు. అందరికీ సుపరిచితమే ఈ టీవీ యాంకర్. బిగ్ బాస్ సీజన్ త్రీలో రన్నరప్ గా నిలిచింది. అయితే…రీసెంట్ గా ఓ టీవీ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను వెళ్లడించింది శ్రీముఖి. జులాయి సినిమా తర్వాత సినిమాల్లో తను ఎందుకు నటించలేకపోయింది చెప్పింది. తన తండ్రి సినిమాలు వద్దన్నారని… జులాయి సినిమా చేస్తున్నప్పుడే ఈ సినిమానే నీకు చివరి కావాలని ఆదేశించినట్లు తెలిపింది. అయితే ఆ తర్వాత రెండు, మూడు ఆఫర్లు రావడంతో ఆ సినిమాల్లో కూడా నటించానని… ఆ తర్వాత సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి, టీవీ షోలతో బిజీ అయ్యానని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.

అయితే… సినిమాలు ఆపేయడానికి మెయిన్ రీజన్ కూడా ఉందని…. జులాయి తర్వాత రెండు, మూడు సినిమా ఆఫర్లు వచ్చినప్పటికీ వాటిని తిరస్కరించానని తెలిపింది. వాటిలో తన పాత్రకు తగిన ప్రాముఖ్యత లేకపోవడం ఒక కారణమైతే… ఎక్స్ పోజింగ్, లిప్ లాక్ సీన్లు చేయాలని అడగడం మరో కారణమని చెప్పింది. అలాంటివి చేయడం మన వల్ల కాదనే సినిమాలు వదులుకున్నానని తెలిపింది. ఆ తర్వాత టీవీ షోలతో బిజీ అయిపోయానని చెప్పింది.