వైరల్ : ప్రధాని నరేంద్ర మోడీ ఫిట్ నెస్ వీడియో

సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్టర్ రాజ్యవర్ధన్ రాథోడ్ ప్రారంభించిన హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్ అనే ఫిట్ నెస్ ఛాలెంజ్ కొనసాగుతూనే ఉంది. దీంట్లో భాగంగానే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రీసెంట్ గా మన ప్రధాని మోడీకి సవాల్ విసిరాడు. కోహ్లీ ఛాలెంజ్ ను స్వీకరించిన మోడీ… ఈ ఫిట్‌నెస్‌ వీడియోను ట్విటర్ లో పోస్ట్‌ చేశారు. ఉదయం వేళ ఎక్సర్‌సైజ్‌ చేస్తూ.. ప్రకృతిలో ఉండే పంచతత్వాలతో తాను ప్రేరణ పొందానంటూ ఓ ట్వీట్ చేశారు. ఇలా చేస్తే ఎంతో రీఫ్రెష్‌గా, ఉత్సాహంగా ఉంటుందని, శ్వాసకు సంబంధించిన ఎక్సర్‌సైజ్‌లు చేస్తానంటూ తన పోస్ట్‌లో చెప్పారు. మనం ఫిట్‌గా ఉంటేనే ఇండియా ఫిట్‌గా ఉంటుందన్నారు మోడీ.

LEAVE A REPLY