Shwetha Menon: మలయాళ నటి శ్వేతా మేనన్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆమెపై కేసు నమోదైంది. అశ్లీల కంటెంట్ ఉన్న సినిమాలు, ప్రకటనలలో నటించి ఆర్థిక లాభాలు పొందారన్న ఆరోపణలపై కేసు నమోదైంది. ఈ కేసు ఎర్నాకులం చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాల మేరకు నమోదైంది. సామాజిక కార్యకర్త మార్టిన్ మేనచెరి ఫిర్యాదు మేరకు ఆమె(Shwetha Menon)పై కొచ్చి పోలీసులు కేసు నమోదు చేశారు. ముందుగా పోలీసులు కేసు నమోదు చేయకుండా పట్టించుకోలేదని, దీంతో మార్టిన్ ఎర్నాకుళం కోర్టును ఆశ్రయించారని సమాచారం.
Martin Menachery accused the actor of involvement in the trade and circulation of pornographic material online, citing scenes from her past work in films#shwethamenon https://t.co/oWPKMiiT2a
— Cinema Express (@XpressCinema) August 6, 2025
అశ్లీల కంటెంట్ ఉన్న సినిమాలు, యాడ్స్ లో నటించి యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఫిర్యాదులో వెల్లడించారు. రథినిర్వేదం (Rathinirvedam), పాలేరి మాణిక్యం (Paleri Manikyam: Oru Pathirakolapathakathinte Katha), కళిమన్ను (Kalimannu) వంటి చిత్రాలలోని దృశ్యాలు, అలాగే ఒక కండోమ్ ప్రకటనలోని సన్నివేశాలను ఆయన ఈ ఫిర్యాదులో ప్రస్తావించారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు బుక్ చేశారు. ఐటీ యాక్ట్ 2000లోని సెక్షన్ 67A (అశ్లీలమైన లేదా లైంగికంగా స్పష్టమైన కంటెంట్‌ను ప్రచురించడం లేదా ప్రసారం చేయడం) కింద, అలాగే అనైతిక ట్రాఫిక్ (నిరోధక) చట్టం సెక్షన్ 3, 5 కింద ఆమెపై కేసు నమోదు చేశారు.
కాగా శ్వేతా మేనన్ ప్రస్తుతం మలయాళ చిత్ర పరిశ్రమకు సంబంధించిన నటీనటుల సంఘం ‘అమ్మ’ (AMMA) అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమెపై కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై శ్వేతా మేనన్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. 1994లో ఫెమినా మిస్ ఇండియా ఏషియా పసిఫిక్ గా నిలిచిన శ్వేతా మేనన్ నటించిన తొలి సినిమా అనస్వరం.
ఆ తరువాత ‘రతి నిర్వేదం’, ‘100 డిగ్రీ సెల్సియస్’లాంటి మలయాళ మూవీస్తోపాటు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లోనూ నటించారు. తెలుగులో శ్రీనువైట్ల డైరెక్షన్ లో వచ్చిన ఆనందం సినిమాలో ఆమె స్పెషల్ సాంగ్ లో నటించారు. జూనియర్స్, రాజన్న తదిరత సినిమాల్లో ఆమె కనిపించారు.
