Andhra: పట్టపగలు యువతి కిడ్నాప్.. బిగ్ ట్విస్ట్ ఏంటంటే?

Andhra :ఏపీలో పట్టపగలు గ్రామ సచివాలయం నుండి మహిళ కిడ్నాప్ అవడం కలకలం రేపింది. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు (ASR) జిల్లాలోని శరభవరంలోని గ్రామ సచివాలయంలో చోటుచేసుకుంది. శరభవరం సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్‌గా డ్యూటీ చేస్తున్న సోయం శ్రీ సౌమ్యను కత్తులు చూపించి కొందరు కిడ్నాప్ చేశారు. స్థానికులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా దుండగులు వాళ్లనూ బెదిరించి ఆమెను ఎత్తుకెళ్లిపోయారు. ఆమె విధుల్లో ఉన్నప్పుడు ఎనిమిది మంది వ్యక్తులు ఇన్నోవాలో తీసుకెళ్లారని సమాచారం.

కిడ్నాప్ సమయంలో యువతి తమకు డబ్బులు ఇవ్వాలంటూ..ఎవరు దగ్గరకి రావద్దంటూ తీసుకెళ్లిపోయారు దుండగులు. కిడ్నాప్ కు ముందు దుండగులు మాస్కులు వేసుకుని సచివాలయానికి వచ్చినట్లు సిబ్బంది చెబుతున్నారు. అయితే పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఈ కిడ్నాపర్లలో ఒకరు ఆమె లవర్ కాశింకోట అనిల్ ఉన్నట్లుగా తేలింది. గతంలో వీరిద్దరూ పెళ్లి చేసుకుందామని పారిపోయారని, మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు వారిని గుర్తించి వారి కుటుంబాలకు తిరిగి ఇచ్చారని సమాచారం. సౌమ్య స్వస్థలం రంపచోడవరం మండలం నర్సాపురం కాగా, అనిల్ మారేడుమిల్లి మండలం వేటుకూరు గ్రామం. నిందితుడిని గుర్తించిన పోలీసులు సౌమ్యను కాపాడేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.