హ్యాట్సాఫ్ ప్రగతి…మహిళలకే కాదు పురుషులకి కూడా మీరు ఆదర్శమే!

ప్రగతి చక్కని నటన, అందం కలిగిన టాలీవుడ్ సహాయక నటి ఆమె ఎప్పుడూ తన ఇన్స్టాగ్రామ్ లో జిమ్ వర్కింగ్ వీడియోలు పెడుతూ ఉంటే, చాలా మంది ముసలిదానివి అవసరమా నీకు, ఎముకలు విరుగుతాయి, నడుములు పట్టేస్తాయి అంటూ చాలా అసభ్యంగా కామెంట్స్ చేసేవాళ్ళు. కానీ ఆమె 2024 సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో సిల్వర్ మెడల్ గ్రహీత అని చాలా మందికి తెలియదు, అలాగే ఇప్పుడు 2025 లో కేరళలో జరిగిన నేషనల్ మాస్టర్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించారు, ఇంకో రెండు విభాగాల్లో సిల్వర్ మెడల్ సాధించారు, ఈ విషయం తెలిశాక అర్దం అయింది ఏమిటంటే..

ఈ లక్ష్యం చేరడం కోసం ఒక పక్క క్షణం తీరిక లేని షూటింగ్ షెడ్యూల్స్ లో కూడా అకుంఠిత దీక్షతో ఒక లక్ష్యం కోసం తన శరీరాన్ని బలంగా తయారు చేసుకున్నారు అని. నిజంగా మీరు ఈ విషయంలో గ్రేట్ ప్రగతి గారూ, మహిళలకే కాదు పురుషులకి కూడా మీరు ఆదర్శం పట్టుదలతో విజయాన్ని సాధించవచ్చు అని చెప్పడానికి కార్య సాధన లక్ష్యం కలిగి ఉంటే వయసు, జెండర్ తో పని లేదు అని నిరూపణ చేసారు. మీకు బ్యాడ్ కామెంట్స్ పెట్టిన ఏ వెధవా పైసాకి పనికిరాకుండా అలాగే ఇన్ స్టా లేదా యుట్యూబ్ , ఫేస్ బుక్ లో కామెంట్స్ పెట్టుకుంటూ భూమికి భారంగా బ్రతుకుతున్నారు. మీరు సాధారణ భారమే కాదు అత్యంత భారాన్ని కూడా సరదాగా భుజాన లేపి నేలకేసి కొట్టి విజేతగా నిలిచారు. హ్యాట్సాఫ్ టూ యువర్ విల్ పవర్..

Credit :  syam