Esther Anil: దృశ్యం చిన్న పాప.. ఫొటోలతో రచ్చ రచ్చ!

ఎస్తర్ అనిల్ కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళ సినిమాల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఆమెకు దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమా దృశ్యం. ఈ సినిమాలో మోహన్‌లాల్, మీనా కూతురు అనుమోల్ పాత్రలో నటించారు.

ఈ సినిమా తెలుగు, తమిళ రీమేక్‌లలో కూడా ఆమె అదే పాత్రను పోషించారు. మలయాళంలో వచ్చిన ఓలు సినిమాలో ఆమె ప్రధాన పాత్రలో నటించి, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమా 17వ ముంబై చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది.  

మాయామోహిని, కోజికోడి, మల్లుసింగ్, లవ్‌సాంజ్ వంటి మలయాళ చిత్రాల్లో కూడా ఆమె కీలక పాత్రలు పోషించారు.

ఆమె తన సోషల్ మీడియా ఖాతాలలో ఎల్లప్పుడూ చురుకుగా ఉంటూ, తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన అప్‌డేట్‌లను పంచుకుంటూ ఉంటారు.