ACB : ఇటీవల కాలంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడుతున్న ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఏసీబీ(ACB) అధికారులకు చాలామంది చిక్కుతున్న ప్రభుత్వ అధికారుల తీరు మాత్రం మారడం లేదు. లంచాల కోసం టేబుల్ కింద చేయిలు పెడుతున్నారు. తాజాగా వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఏసీబీ అధికారులు సోదాలు చేయగా ఓ మహిళా ఉద్యోగి పట్టుబడింది.
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ప్రభుత్వ ఉద్యోగులు
వికారాబాద్ జిల్లా నవాబుపేట మండల తహసీల్దార్ కార్యాలయానికి ప్రొసీడింగ్ కాపీ పంపేందుకు, రూ.15,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కలెక్టరేట్ కార్యాలయ మహిళా రెవెన్యూ ఉద్యోగి సుజాత
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలో డీఏ బిల్లులు… pic.twitter.com/WyTtvMNOfl
— Telugu Scribe (@TeluguScribe) August 12, 2025
నవాబుపేట మండల తహసీల్దార్ కార్యాలయానికి ప్రొసీడింగ్ కాపీ పంపేందుకు, రూ.15,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కింది కలెక్టరేట్ కార్యాలయ మహిళా రెవెన్యూ ఉద్యోగి సుజాత. ఇందులో బిగ్ ట్విస్ట్ ఏంటంటే కలెక్టర్ సంతకం కోసం టేబుల్ మీద ఫైల్ పెట్టడానికే రూ. 5 వేలు ముందుగానే ఫోన్ పే ద్వారా లంచం తీసుకుంది సుజాత.
ఇక మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలో డీఏ బిల్లులు చేసేందుకు బాధితుడి వద్ద రూ.6,000 లంచం తీసుకుంటూ, ఏసీబీకి చిక్కాడు పీహెచ్‌సీ ఇన్‌చార్జ్ గడియారం శ్రీనివాసులు. అవినీతి అధికారులు ఏ శాఖలో ఉన్నా వారి అంతు చూస్తుంది ఏసీబీ. ఫిర్యాదులు రాగానే వెంటనే రంగంలోకి దిగుతుంది.
లంచం అడిగే ప్రభుత్వ ఉద్యోగుల గురించి ఫిర్యాదు చేయాలనుకుంటే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 లేదా వాట్సాప్ నంబర్ 9440446106 కు సంప్రదించవచ్చ అని జనంలోకి విస్తృతంగా తీసుకువెళ్తున్నారు ఏసీబీ అధికారులు. మీ వివరాలను గోప్యంగా ఉంచుతామని చెబుతున్నారు.