Tollywood : ఇండస్ట్రీకి మొగుడొచ్చాడు.. రేవంత్ రెడ్డి సూపర్ సక్సెస్!

Tollywood  ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ రాజకీయాలను శాసిస్తూ ఉండేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్. ఇందుకు పురుడు పోసింది ఏపీ మాజీ సీఎం జగన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ వారసత్వాన్ని ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారు. నాగార్జునకు చెందిన N కన్వెన్షన్ సెంటర్ ను కూల్చడం, పుష్ప2 ఇష్యూలో అల్లు అర్జున్ అరెస్టు తర్వాత ఇండస్ట్రీ ఒక్కసారిగా షేక్ అయింది. ఇప్పుడు కార్మికుల సమ్మె విషయంలో ఇండస్ట్రీ పెద్దలు దిగిరాకపోవడంతో రేవంత్ ప్రభుత్వం జోక్యం చేసుకుంది. సమస్యకు చెక్ పెట్టింది.

ఇందుకు థ్యాంక్స్ చెప్పేందుకు నిర్మాతలు, దర్శకులు ఆదివారం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సమయంలో ఇండస్ట్రీకి సీఎం రేవంత్ రెడ్డి కొన్ని హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. ఇండస్ట్రీని చెప్పుచేతల్లో పెట్టుకుని శాసిస్తామంటే కుదరదని, అందరినీ కలుపుకుపోవాలని హెచ్చరించినట్లు తెలుస్తోంది. లేకుంటే తన ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, తప్పకుండా జోక్యం చేసుకుంటుందని వార్నింగ్ ఇచ్చారని సమాచారం. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి హావభావాలు ఇండస్ట్రీ పెద్దలకు ఇబ్బందికరంగా మారినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఇండస్ట్రీకి ఓ మొగుడొచ్చాడు.

Credi : C L N Raju