Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై కృష్ణానగర్ కొత్వాలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది . మంగళవారం (26 ఆగస్టు 2025) పశ్చిమ బెంగాల్లో అక్రమ చొరబాటుకు సంబంధించి మహువా మొయిత్రా సంచలన కామెంట్స్ చేసి వివాదాల్లో చిక్కుకుంది.
పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లాలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న మహువా మొయిత్రా, బంగ్లాదేశ్ నుండి జరుగుతున్న అక్రమ చొరబాట్ల గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “కేంద్ర హోంమంత్రి అమిత్ షా పదేపదే చొరబాటుదారులు, చొరబాటుదారులు అని చెబుతున్నారు. ఒకవేళ సరిహద్దుల గుండా రోజూ లక్షల మంది ప్రజలు దేశంలోకి చొరబడుతుంటే, అది ఎవరి తప్పు?” అని ప్రశ్నించారు.
#WATCH | Delhi: On TMC MP Mahua Moitra's reported remark, BJP spokesperson Shehzad Poonawalla says, "… The derogatory remarks Mahua Moitra has made about Maa Kali, constitutional institutions, and their impact on national security are well known to everyone. And now it seems… pic.twitter.com/LxwvyyJL5u
— ANI (@ANI) August 29, 2025
ఈ విషయంపై ఆమె తీవ్రంగా స్పందిస్తూ, “ఒకవేళ దేశ సరిహద్దులను రక్షించడంలో హోంమంత్రిత్వ శాఖ విఫలమైతే, ముందుగా అమిత్ షా తల నరికి ప్రధాని మోదీ టేబుల్ మీద పెట్టాలి” అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.అయితే మహువా మొయిత్రా చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యాన్ని, ప్రజా ప్రతినిధులను అవమానపరచడమేనని బీజేపీ నేతలు ఖండించారు. మహువా వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని, ఇది బాధ్యతారాహిత్యమైన చర్య అని బీజేపీ విమర్శించింది. ఇప్పటికే దీనిపై పోలీసులకు ఫిర్యాదులు కూడా అందాయి.
