CBI విచారణకు హైకోర్టు బ్రేక్ వేసిందా ?

CBI : కాళేశ్వరంపై సీబీఐ విచారణ కోరుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాసిన లేఖ సీబీఐకి అందింది. తమకు అందినట్లు సీబీఐ అక్నాలెడ్ట్‌మెంట్ ఇచ్చింది. పీసీ ఘోష్ నివేదిక అధారంగా ఎలాంటి చర్యలూ చేపట్టవద్దని ఆదేశించాలంటూ కేసీఆర్, హరీశ్ రావు వేసిన పిటిషన్లపై హైకోర్టులో సానుకూల తీర్పు వచ్చింది. పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని ఆదేశిస్తూ అక్టోబర్a 7కు తదుపరి విచారణను వాయిదా వేసింది హైకోర్టు. అసలు పీసీ ఘోష్ నివేదికను ప్రస్తావించకుండానే NDSA రిపోర్ట్ ఆధారంగా సీబీఐ విచారణ జరపాలని లేఖ రాసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సో.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు ఆటంకం కాబోవు..! కేంద్ర హోంశాఖ సెక్షన్ 5 మేరకు అనుమతి మంజూరు చేస్తే కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేపట్టవచ్చు.

NDSA రిపోర్ట్ ఆధారంగా కాళేశ్వరం విచారణ చేపట్టాలని సీబీఐని కోరిన తెలంగాణ ప్రభుత్వం..మరీ పీసీ ఘోష్ కమిషన్ ఎందుకు వేసినట్లు..?.. ముందే NDSA రిపోర్ట్ ఆధారంగా సీబీఐ విచారణకు ఇవ్వొచ్చు కదా ఎందుకు రెండేళ్లు కాలయాపన..?.. ఘోష్ ను గొప్ప న్యాయం కోవిదుడు..అని ప్రచారం చేసిన కాంగ్రెస్ అండ్ కో మరీ ఇప్పుడు ఆయన రిపోర్ట్ ఆధారంగా కాకుండా.. మళ్ళీ ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా విచారణ కోరడం అంటే.. ఘోష్ కమిషన్ ను అవమానించడమే కాదు.. అసలు ఘోష్ కమిషన్ కేసీఆర్ కు హరీష్ రావు కు కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి అవకతవకలు జరగలేదని క్లీన్ చిట్ ఇచ్చినట్లే అని స్పష్టంగా కనిపిస్తోంది.