Kavitha : విశ్వదాభిరామ.. కవితను ట్రోల్ చేస్తున్నార్రా మావా!

Kavitha :  బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. హరీష్ రావు, సంతోష్ రావు పై కవిత ఇటీవల చేసిన సంచలన ఆరోపణలు పార్టీపై తీవ్ర వ్యతిరేకత తీసుకురావడంతో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిలో హరీష్ రావు పెద్ద అవినీతి కొండ అని కవిత సంచలన ఆరోపణ చేశారు. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం హరీష్ రావుకు అండగా నిలిచింది. కేటీఆర్ తో సహా అంతా హరీష్ డైనమిక్ లీడర్ అని ట్వీట్లు చేశారు. కాగా గతంలో చాలామంది ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ కు హరీష్ రావు వెన్నుపోటు కూడా పొడుస్తారని ఎన్నోసార్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ ఎప్పటికీ కేసీఆర్ వాటిని పట్టించుకోలేదు. హరీష్ కూడా అలా ప్రవర్తించలేదు.

తాను పార్టీకి విధేయుడుగా ఉంటానని హరీష్ రావు కూడా చాలాసార్లు చెప్పుకొచ్చారు. అలాంటి విధేయుడు వైపే గులాబీ బాస్ అండగా నిలిచారు. కవిత కన్న కూతురు అని కూడా చూడకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేసి అల్లుడైన హరీష్ రావు వైఫై కేసీఆర్ నిలబడ్డారు. కన్న కూతురైన పార్టీ తర్వాతే ఎదైనా అన్న సంకేతాలను కేడర్ కి పంపించారు కేసీఆర్.

అల్లుడు హరీష్ వెన్నుపోటు పొడుస్తాడని చాలా మంది ప్రతిపక్ష నాయకులు అనుకున్నారు కానీ కూతురే అలాంటి పనిచేస్తుందని ఎవరూ ఊహించి ఉండరని కార్యకర్తలు అనుకుంటున్నారు. కవితను ఓ వేమన కవితతోనే పోలుస్తున్నారు.

చెప్పులోని రాయి చెవిలోని జోరీగ
కంటిలోని నలుసు కాలి ముల్లు
ఇంటిలోని పోరు నింతింత గాదయా
విశ్వదాభిరామ వినురవేమ!

చెప్పులోని రాయి, చెవిలో జోరిగ, కంటిలో నలుసు, కాలిలో ముల్లు చిన్నవే అయినా వీటి బాధ ఎక్కువే ఇంట్లో పోరు వీటి అన్నింటి కంటే బాధాకరమైంది.