AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు అయింది. విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చింది. కేవలం 5 రోజులు మాత్రమే బెయిల్ మంజూరు చేసింది కోర్టు. తిరిగి ఈనెల 11న సరెండర్ కావాలని ఆదేశించింది కోర్టు. కాగా రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు మిథున్ రెడ్డి. ఏపీ లిక్కర్ స్కాంలో A4గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని రూ.50వేల పూచీకత్తు, ఇద్దరి ష్యూరిటీ ఇవ్వాలంది కోర్టు. ఆయన పూర్తి బెయిల్ పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది. దర్యాప్తు సంస్థల వాదనలు, ఆయన తరఫు న్యాయవాదుల వాదనల తర్వాత కోర్టు తుది నిర్ణయం వెల్లడించనుంది.
బ్రేకింగ్ న్యూస్
లిక్కర్ కేసులో @YSRCParty ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్
ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ ఎంపీ
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనుమతి
ఈ నెల 11న తిరిగి సరెండర్ కావాలని ఆదేశం
— Man Without Enemies🧢 (@YellaturR) September 6, 2025