ACB: ఓర్ని.. లంచం తీసుకుని దొరికిపోయి ఏడ్చేసింది!

ACB: లంచగొండుల మీద ఏసీబీ అధికారులు వరుస దాడులు చేస్తున్న లంచం తీసుకొనే అధికారుల తీరు మాత్రం అస్సలు మారట్లేదు. తాజాగా హైదరాబాద్ శివారులోని నార్సంగి మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మనీ హరికను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

మంచిరేవులలో ఒక ప్లాట్ కు సంబంధించిన లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) ఫైల్ క్లియర్ చేయడానికి రూ.10 లక్షలు డిమాండ్ చేసి, రూ. 4 లక్షలు తీసుకుంటుండగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అధికారులకు పట్టుబడ్డక ఆమె కన్నీరు పెట్టుకోవడం గమనార్హం. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి. టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు గతంలో జారీ చేసిన అనుమతులకు సంబంధించిన ఫైళ్లను అధికారులు తనిఖీ చేస్తున్నారు.

మరో ఘటనలో నారాయణపేట జిల్లాకు చెందిన ఒక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రూ.5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పని కోసం ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగితే ఫిర్యాదు చేయాలని ACB ప్రజలను కోరింది.