రష్యా నుంచి చమురు దిగుమతులను పూర్తిగా నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాటో కూటమిలోని అన్ని దేశాలను కోరారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. దీనివలన రష్యా ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తుందని, ఉక్రెయిన్‌పై యుద్ధానికి నిధులు సమకూర్చడం కష్టమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అన్ని నాటో దేశాలు రష్యా నుండి చమురు కొనుగోలు చేయడం మానేసినప్పుడు, రష్యాపై పెద్ద ఆంక్షలు విధించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ఆయన సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇక చైనా తమ వాణిజ్య విధానాలను మార్చుకోకపోతే, ఆ దేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 50% నుండి 100% వరకు భారీ సుంకాలను విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఈ చర్య అమెరికాలోని పరిశ్రమలను, ఉద్యోగాలను రక్షిస్తుందని ఆయన పేర్కొన్నారు. కాగా రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నందున భారత్‌పై ఇప్పటికే ట్రంప్ 50 శాతం టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే.
Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
