నటుడు జగపతి బాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘జయమ్ము నిశ్చయము రా’ అనే టాక్ షోలో ఇటీవల పాల్గొన్నారు హీరోయిన్ మీనా.
తన భర్త విద్యా సాగర్ చనిపోయిన తరువాత సోషల్ మీడియాలో తనపై వచ్చిన న్యూస్‌పై ఆమె అసహానం వ్యక్తం చేశారు.
ముఖ్యంగా తన భర్త మరణించిన వారం రోజులకే ఇతర నటులతో తనకు సంబంధం ఉందని అతన్ని పెళ్లి చేసుకోబోతున్నానని వార్తలు రాశారని చెప్పారు. వాళ్లకు కుటుంబాలు ఉండవా.. ఇలా రాస్తున్నారు. అని చాలా బాధపడ్డానని తెలిపారు.
ఆ తర్వాత ఎవరు విడాకులు తీసుకొన్నా తనతో పెళ్లి అని రాసేవారని, అలాంటి వార్తల వల్ల నాకు అసహ్యం వేసేదని మీనా చెప్పుకొచ్చారు. కాగా మీనా తన భర్త విద్యా సాగర్‌ను మూడేళ్ల క్రితం చనిపోయారు.
విద్యా సాగర్ 2022లో 48 సంవత్సరాల వయసులో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా తుదిశ్వాస విడిచారు. తన కుమార్తెతో ఆమె నివాసం ఉంటున్నారు.
1986లో చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి వచ్చిన మీనా తమిళంతో పాటు తెలుగులోనూ అగ్ర హీరోల సరసన నటించారు. హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉండగానే 2009లో విద్యాసాగర్‌ను పెళ్లి చేసుకున్నారు మీనా.