Paradha : అనుపమ పరదా.. అమ్మాయిలు తప్పకుండా చూడాలి!

Paradha:  పరదాలు వేసుకోవడం అనేది నార్త్ ఇండియాలో ఉన్న ఒక ఆచారం.. కానీ సౌత్ ఇండియాలో కూడా ఒక ఊరిలో ఇటువంటి ఆచారం ఉంటుంది.. ఎందుకంటే అక్కడ ఒక జ్వాలమ్మ అనే దేవత ఉంటుంది.. ఆమె ఒకప్పుడు గర్భవతిగా ఉన్న సమయంలో ఆమెను నలుగురు అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తారు. ఆమె ఒక బావిలో దూకి చనిపోతుంది.. అప్పటినుంచి ఆ ఊరిలో ఎవరైనా కానీ మహిళలు పరద వేసుకోకుంటే ఇక ఆ ఊరిలో ఎవరికీ పిల్లలు పుట్టరు.. కావున పుష్పవతి అయిన సమయము నుంచి తన తల్లిదండ్రులు భర్త తప్ప ఎవ్వరు కూడా ఆమె ముఖం చూడడానికి వీలు లేదు ఎల్లప్పుడూ పరదాతోనే ఉండాలి… ఒకవేళ పరద తీసినట్లు తెలిసిందో ఇక అంతే.. ఆమెను ఆత్మాహుతి చేసేస్తారు.

సుబ్బలక్ష్మి అలియాస్ అనుపమ పరమేశ్వరన్ ఆ సాంప్రదాయాన్ని కచ్చితంగా పాటించే అమ్మాయి.. కాకపోతే ఆమెకు రేపు పెళ్లి అనగా ఒక పెద్ద మ్యాగజైన్లో ఆమె ఫోటో ప్రచురించినట్లు కనబడుతుంది.. గ్రామ ప్రజలు ఆమెను ఆత్మహుతి చేయాలి అనుకుంటారు.. కానీ ఆమె నేనెప్పుడూ పరదా తీయలేదు నా తప్పులేదు అని చెప్తుంది.. ఆ ఫోటోగ్రఫీ తీసిన ఫోటోగ్రాఫర్ ధర్మశాలలో ఉంటాడు.. అక్కడికి వెళ్లి అతని ద్వారా వివరణ తీసుకొని వస్తే ఆమెకు మరల పెళ్లి జరిగే అవకాశం ఉంటుంది అని ప్రజలు తీర్మానిస్తారు.. ఇక ఆమె మరో మహిళ అత్త సహాయంతో అక్కడికి వెళ్లడానికి ప్రయత్నిస్తుంది.

వీరిని తీసుకెళ్లడానికి మరో మహిళ సివిల్ ఇంజనీరింగ్ గా పనిచేస్తూ ఢిల్లీలో ఉండి కష్టాలు పడుతూ కెరీర్ గ్రోత్ కోసం ఎంతో కష్టపడినా కానీ సక్సెస్ రాకపోవడం వల్ల ఆడవాళ్లు మగవారి కంటే ఎందులో తక్కువ అంటూ బాధపడే ఇంకో అమ్మాయి కలుస్తుంది.. ఈ ముగ్గురు ఢిల్లీ నుంచి ధర్మస్థల కు వెళ్లే దారిలో జరిగే అనుభవాల పరంపరలో వారు తమను తామే సంస్కరించుకుంటారు.. జీవితం చాలా గొప్పదని దానిని ఈ మూఢనమ్మకాల ముసుగులో ఉంచడం అనేది తప్పని సుబ్బలక్ష్మి తెలుసుకుంటుంది.. హౌస్ వైఫ్ అయినా ఆమె అత్త కూడా ఎప్పుడూ సంసారం పిల్లలు భర్తనేనా తనకు ఒక అభిరుచి లైఫ్ ఉండాలి.. దానిని నెరవేర్చుకోవాలి అని తెలుసుకుంటుంది.

జీవితమంటే కెరీరే కాదని అన్ని విషయాలు అవసరమే అని భార్యాభర్త పిల్లలు సంసారం లాంటివి కూడా ముఖ్యమే అనే విషయం తెలుసుకుంటుంది.. సుబ్బలక్ష్మి పరదా లేకుండానే తన ఊరికి తిరిగి వస్తుంది.. కానీ ఒక డెలివరీ అయ్యే మహిళ అలా వచ్చినా కానీ నార్మల్ డెలివరీ అయింది.. అప్పుడు ఆ ఊరిలో వారందరూ తమ పరదాలను తీసేస్తారు.. జిందగీ మిలేగి దోబార అనే సినిమా మాదిరి అనిపించిన కానీ ఫెమినిజం, స్త్రీ స్వాతంత్రం, మహిళలు అభిప్రాయాలు లాంటి విషయాల మీద కొంచెం చర్చ జరుగుతుంది… అనుపమ పరమేశ్వరన్, సంగీత, రాజేంద్రప్రసాద్ లాంటి నటులు కూడా ఇందులో బాగా నటించారు.. మహిళలకు ఈ సినిమా బాగా నచ్చే అవకాశం ఉంది.. తప్పకుండా చూడొచ్చు.. ప్రైమ్ లో ఉంది.

డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి MS MCh