తెలుగు రాష్టాల్లో ఎక్కువగా బియ్యాన్ని అన్నంగా వండుకుని తింటారు. చపాతీలు తదితర టిఫిన్స్ చేసుకున్నప్పటికీ ప్రధానంగా అన్నం తినడం అనేది ఉంటుంది. అయితే మూడు పూటలు అన్నమే తింటే మంచిదా అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది.
మూడు పూటలు అన్నం తినడం వలన లాభాల కంటే ఎక్కువగా నష్టాలు ఉన్నాయని వైద్యులు అంటున్నారు. అన్నం తినగానే బాడీలో గ్లూకోజ్ స్థాయిలో వేగంగా పెరుగుతుంది. డయాబెటిక్ రోగులు, అధిక బరువు ఉన్నవారు మాత్రం ఈ పద్దతిని మార్చుకోవాలని సూచిస్తున్నారు.



