BIG BREAKING : మోదీకి ట్రంప్ ఫోన్ కాల్.. ఎందుకంటే?

భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఫోన్ చేసి మరీ శుభాకాంక్షలు తెలిపారు. తనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపినందుకు ట్రంప్ కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. సెప్టెంబర్ 17న ప్రధాని మోదీ 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

“నా 75వ పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన నా మిత్రుడు అధ్యక్షుడు ట్రంప్ కు ధన్యవాదాలు. మీలాగే, నేను కూడా భారత్ , యుఎస్ సమగ్ర ప్రపంచ భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాను” అని Xవేదికగా ప్రధాని మోదీ తన పోస్టులో తెలిపారు.

ఈ ఫోన్ కాల్‌లో ఇరువురు నేతలు ఉక్రెయిన్ సమస్య పరిష్కారంపై కూడా చర్చించారు. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న వివాదంలో ట్రంప్ శాంతి ప్రయత్నాలకు మోదీ మద్దతు ప్రకటించారు, “ఉక్రెయిన్ వివాదానికి శాంతియుత పరిష్కారం దిశగా మీరు చేస్తున్న చొరవలకు మేము మద్దతు ఇస్తున్నాము” అని అన్నారు. జూన్ 17 తర్వాత ఇద్దరు ప్రపంచ నాయకుల మధ్య జరిగిన మొదటి ఫోన్ కాల్ ఇది.

మోదీ, ట్రంప్ మధ్య ఈ చర్చలు ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే, ఉక్రెయిన్ యుద్ధంపై శాంతి చర్చలకు ఇది సానుకూల వాతావరణాన్ని కల్పిస్తుందని అభిప్రాయపడుతున్నారు.