Telugu Heroine: ఈ హీరోయిన్ ను గుర్తుపట్టారా?

Telugu Heroine:  2001 లో అనిత హాసాన్ ఆనందిని అనే ఒక 20 ఏళ్ళ నటి తెలుగులో తన మొదటి సినిమా చేసింది . ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. ఆ సినిమా వేరేదో కాదు ఉదయ్ కిరణ్ నటించిన నువ్వు నేను సినిమా. మొదటి సినిమానే అది ఇరవై ఏళ్లకే చేసి చాలా పెద్ద హిట్ సాధించడం నిజంగా చాలా గొప్ప విషయం కానీ దీని తర్వాత తెలుగులో ఎక్కువగా సినిమాలు చేయలేదు. కేవలం మూడో నాలుగో సినిమాలే చేసింది.

ఆ తర్వాత మళ్లీ పెద్దగా నటించలేదు కొన్ని కొన్ని సినిమాలలో ” కెమియో అప్పియరెన్స్” మాత్రమే చేసింది. సాధారణంగా ఎవరైనా రియాల్టీ షోస్, సీరియల్స్ చేసి ప్రసిద్ధి అయ్యి సినిమాలలోకి వస్తారు కానీ తను సినిమాలలో ప్రసిద్ధి చెంది ఆ తరువాత సీరియల్ లకు, రియాలిటీ షోలకు వెళ్ళింది.

కొంత వింతగా అనిపించినా ఇది నిజమే. సినిమా పరిశ్రమలో ఎవరు ఎక్కువగా ప్రసిద్ధి చెందుతారో, ఎవరికి ఎక్కువగా సినిమాలు వస్తాయో అన్నది చెప్పడం చాలా కష్టం.

ఈవిడ ఇప్పటి వరకు ఐదు భాషలలో నటించింది కానీ ఎవరికీ ఆవిడ పేరు కానీ ఆవిడ ఎవరో అని తెలియని వారు ఇంకా చాలామందే ఉన్నారు. ఇప్పుడు తనకి 40 ఏళ్లు కాబట్టి మళ్ళీ సినీ పరిశ్రమలోకి తిరిగి రావడం అన్నది అసంభవం . అనిత పెద్దగా ఎక్కువగా సినిమాలు చేయకపోయినా మొదటి సినిమానే పెద్ద హిట్ కొట్టిన నటిగా మిగిలిపోతుంది.