BIG BREAKING : బీహార్ అసెంబ్లీ 2025 ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. అన్ని పార్టీలు ఎన్నికల బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఎలక్షన్ కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. EVMలపై గుర్తుతో పాటు అభ్యర్థుల కలర్ ఫోటోలు ఉంచాలని నిర్ణయించింది. బీహార్ ఎన్నికల నుంచే ఈ కొత్త నిబంధనను ఈసీ దీనిని అమలు చేయనుంది. ఈసీ తీసుకున్న ఈ నిర్ణయంతో ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థిని మరింతగా గుర్తించి ఎన్నుకోవచ్చు.
Key decision by the #ElectionCommission on EVMs.
Along with candidate names and symbols, their color photographs will also be displayed on the EVMs.
The Election Commission will implement this process starting from the Bihar elections. pic.twitter.com/AN3vxJFY0v
— Hyderabad DNA (@HyderabadDna) September 17, 2025
ఒకే పేరు గల అభ్యర్థులు ఉన్నప్పుడు గతంలో ఓటర్లు గందరగోళానికి గురయ్యేవారు. ఇప్పుడు ఫోటోలు ఉండటం వల్ల సరైన అభ్యర్థిని సులభంగా గుర్తించవచ్చు. వృద్ధులు, అక్షరాస్యులు కాని ఓటర్లకు ఈ మార్పులు చాలా సహాయపడతాయి. ఫోటోను చూసి తమకు కావాల్సిన అభ్యర్థికి ఓటు వేయగలుగుతారు. ఈ కొత్త నిబంధనలు బిహార్‌తో పాటు, రాబోయే ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో కూడా అమలు చేయబడతాయి. ఈ మార్పులు గత ఆరు నెలల్లో ఎన్నికల కమిషన్ తీసుకున్న 28 సంస్కరణలలో భాగం.