BIG BREAKING : తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు బ్రేక్

BIG BREAKING : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సెప్టెంబర్ 30 లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ, గడువులోపు అది సాధ్యం కాదని తెలిపారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సీఎం… ఎన్నికల నిర్వహణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.

గడువు పొడిగింపు కోసం ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించనున్నట్లు సీఎం తెలిపారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చిస్తామని సీఎం అన్నారు. ప్రస్తుత పరిస్థితులను హైకోర్టుకు వివరించి ఏం చేయాలో కోరుతామన్నారు.

సీఎం రేవంత్ తాజా ప్రకటనతో ఇప్పట్లో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు లేవని క్లియర్ గా అర్థం అవుతుంది. కాగా స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30 లోపు నిర్వహించాలని ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను తెలంగాణ హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.