Jr NTR : ఎన్టీఆర్‌కు తీవ్ర గాయాలు..షూటింగ్‌లో ప్రమాదం!

Jr NTR : ఎన్టీఆర్‌కు యాడ్ షూట్‌లో తీవ్ర గాయాలయ్యాయి. కాలిపై భారీ వస్తువు పడిపోయింది.వెంటనే ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రముఖ కంపెనీ యాడ్ షూటింగ్‌లో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొన్నారు. ఫైట్ సీన్ చేస్తుంటే ప్రమాదకర స్టంట్‌లో కాలిపై భారీ వస్తువు పడిపోయింది. తీవ్ర గాయాలతో ఆయన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. దీనిపై కాసేపటికే ఎన్టీఆర్ టీమ్ అధికారిక ప్రకటన చేసింది. “ఈరోజు యాడ్ షూట్‌లో చిన్న గాయం అయింది. వైద్యుల సలహాతో 2 వారాలు రెస్ట్ తీసుకుంటారు. కండిషన్ స్టేబుల్, వర్రీ అవసరం లేదు. వైద్యులు కూడా, స్వల్ప గాయం మాత్రమే, త్వరగా కోలుకుంటారని చెప్పారు. యాడ్ చిత్రీకరణ మధ్యలోనే ఆగిపోయింది అని తెలిపింది. కాగా ఈ వార్తతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ షాక్‌లో మునిగిపోయారు. సోషల్ మీడియాలో ప్రార్థనలు, వెల్ విషెస్ వర్షాధారంగా కురుస్తున్నాయి. ఎన్టీఆర్‌ త్వరగా కోలుకోవాలి అంటూ ట్వీట్లు చేస్తున్నారు.

Image