పేదలకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన డబ్బులను తమ ఖాతాల్లో వేసుకొని స్వాహా చేసిన ఏడుగురిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఓ మంత్రి వద్ద పనిచే సిన జోగుల నరేశ్ కుమార్ (42) గత ప్రభుత్వ హయంలో సీఎం సహాయనిధి కింద 230 మందికి మంజూరైన చెక్కులను పంపిణీ చేయకుండా అలాగే ఉంచాడు.
ప్రభుత్వం మారిన తర్వాత వాటిని స్వాధీనం చేసుకున్నా డు. అందులో దాదాపు 19 మంది లబ్దిదారులు సంబంధించిన చెక్కులను గుర్తించి లబ్ధిదారుల పేర్లతో నకిలీ పత్రాలు సృష్టించి వాటిని జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 5లో ఉన్న ఎస్ బీఐ బ్యాంకులో జమ చేశాడు. ఇలా సుమారు రూ.8.71లక్షలు కాజేశాడు. ఈ కేసులో జోగుల నరేశ్ తో పాటు బాలగోని వెంకటేశ్, కోరల పాటి వంశీ, పులిపాక ఓంకార్తో పాటు మరి కొందరిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసిన జూబ్లీహిల్స్ సీఐ సత్యనారాయణ నకిలీ లబ్ది దారులుగా మారి చెక్కులను తమ ఖాతాలో వేసుకొని డబ్బులను విత్ డ్రా చేసుకున్న పొట్ల రవి (46), జనగామ నాగరాజు (40), మాటేటి భాస్కర్ (33), ధర్మారం రాజు (50), కాంపల్లి సంతోష్(35), చిట్యాల లక్ష్మి(65), అసంప ల్లి లక్ష్మిని అరెస్ట్ చేశారు. వీరిని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఈ కేసులో ఉన్న ఇతర నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు.