మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కింది. 2023 సంవత్సరానికి అవార్డును ప్రకటించింది కేంద్రం. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ అవార్డును ప్రకటించింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎంపిక కమిటీ సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఈ అవార్డును సెప్టెంబర్ 23, 2025న జరిగే 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో ప్రదానం చేస్తారు. ఈ వార్తను ధృవీకరిస్తూ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ Xలో ఒక పోస్ట్‌ను షేర్ చేసింది. నటుడు గానే కాకుండా దర్శకుడు,నిర్మాతగా మోహన్ లాల్ రాణించారు. నాలుగు దశాబ్దాల కెరీర్లో మళయాళంతో పాటు తెలుగు, తమిళం,హిందీ,కన్నడ భాషలో 350 కి పైగా సినిమాలలో మోహన్ లాల్ నటించారు.
ఉత్తమ నటుడిగా రెండుసార్లు జాతీయ చలనచిత్ర అవార్డులు, 2001లో పద్మశ్రీ, 2019లో పద్మభూషణ్ అవార్డులను కూడా అందుకున్నారు. కాగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దేశంలోని అత్యున్నత పురస్కారం, దీనిని భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం సినిమా పరిశ్రమకు చేసిన జీవితకాల కృషిని గౌరవించటానికి ప్రదానం చేస్తుంది.
గత ఏడాది నటుడు మిథున్ చక్రవర్తికిదాదాసాహెబ్ ఫాల్కే జీవిత సాఫల్య పురస్కారం లభించింది . కాగా ఈ సందర్భంగా మోహన్‌లాల్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా అభినందించారు.
ശ്രീ മോഹൻലാൽ ജി പ്രതിഭയുടെയും അഭിനയ വൈവിധ്യത്തിന്റെയും പ്രതീകമാണ്. പതിറ്റാണ്ടുകൾ നീണ്ട സവിശേഷമായ കലാസപര്യയിലൂടെ, മലയാള സിനിമയിലും നാടകത്തിലും പ്രമുഖ വ്യക്തിത്വമായി നിലകൊള്ളുന്ന അദ്ദേഹത്തിന്, കേരള സംസ്കാരത്തിൽ തീവ്രമായ അഭിനിവേശമുണ്ട്.തെലുങ്ക്, തമിഴ്, കന്നഡ, ഹിന്ദി സിനിമകളിലും… https://t.co/4MWI1oFJsJ pic.twitter.com/MJp4z96RlV
— Narendra Modi (@narendramodi) September 20, 2025