Accenture : ఏపీలో యాక్సెంచర్…12 వేల ఉద్యోగాలు..లోకేషన్ ఎక్కడంటే?

Accenture : ఏపీ ప్రభుత్వం వైజాగ్ ను ఐటీ హబ్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో అమెరికన్ ఐటీ దిగ్గజం యాక్సెంచర్ అక్కడ కొత్త క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సమర్పించింది. ఈ క్యాంపస్ ద్వారా దాదాపు 12 వేల మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

అయితే ప్రస్తుతానికి ఈ ప్రతిపాదన చర్చల దశలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం యాక్సెంచర్ సుమారు 10 ఎకరాల ల్యాండ్ కేటాయించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. యాక్సెంచర్ ప్రతిపాదన ప్రభుత్వ ఐటీ పాలసీలకు అనుగుణంగా ఉన్నందున త్వరలోనే ఆమోదం పొందే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

యాక్సెంచర్‌తో పాటుగా టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ఇతర ప్రముఖ ఐటీ సంస్థలు కూడా విశాఖలో తమ క్యాంపస్ లను విస్తరించే అవకాశం ఉంది. కాగ్నిజెంట్ 183 మిలియన్ డాలర్లు, టీసీఎస్ 154 మిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టనున్నాయి.

ఏపీ ప్రభుత్వం పెద్ద కంపెనీలకు ఎకరానికి కేవలం 0.99 రూపాయల చొప్పున భూమిని లీజుకు ఇస్తుంది. కాగా ప్రస్తుతం యాక్సెంచర్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా దాని 790,000 మంది ఉద్యోగులలో 300,000 మందికి పైగా ఉద్యోగులతో భారత్ లో అతిపెద్ద ఉద్యోగులను కలిగి ఉంది.