BIG BREAKING : తెలంగాణలో పవన్ ‘OG’ సినిమాకు బ్రేక్!

OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమాకు తెలంగాణ హైకోర్టు ఊహించని షాకిచ్చింది. ఈ సినిమాకు బెనిఫిట్ షో, టికెట్ల రేట్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ మేరకు జస్టిస్ ఎన్.వి శ్రవణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

టికెట్ ధరల పెంపుపై హోంశాఖ ఇచ్చిన మెమోను సవాల్ చేస్తూ.. మహేష్ యాదవ్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. టికెట్ల ధర పెంపునకు అనుమతి ఇవ్వడానికి హోంశాఖ స్పెషల్ CSకి ఎలాంటి అధికారాలులేవని వాదించారు. హైదరాబాద్ పరిధిలో పోలీస్ కమిషనర్, జిల్లాల పరిధిలోజాయింట్ కలెక్టర్ కు మాత్రమే మెమో జారీ చేసే అధికారం ఉందని కోర్టుకు తెలిపారు.

సినిమా టికెట్లు అధిక ధరకు విక్రయించకూడదన్న నిబంధనలు ఉన్నాయని వివరించారు. గేమ్ చేంజర్ సినిమా సందర్భంగా  హోం శాఖ అండర్ టేకింగ్ ఇచ్చిందని తెలిపారు. ఆ వాదనని పరిగణలో తీసుకున్న జస్టిస్ శ్రవణ్ కుమార్ .. టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ జారీ చేసిన మెమోను సస్పెండ్ చేశారు. తదుపరి విచారణ అక్టోబర్ 9కి వాయిదా వేశారు

ఈ క్రమంలో ఈ రోజు రాత్రి 10 గంటలకు పడాల్సిన ప్రీమియర్స్, కొనుగోలు చేసిన టికెట్లపై సందిగ్ధత నెలకొంది. ప్రతి క్రేజీ సినిమాకు ప్రీమియర్ షో, బెనిఫిట్‌ షో టిక్కెట్ల రేట్లు పెంచడం కామనే. అయితే అవి ఒక్కోసారి హద్దులు దాటిపోతుంటాయి. అభిమానులకు, సామాన్య ప్రేక్షకులకు ఆ టిక్కెట్ల రేట్లు అందుబాటులో ఉండకుండా పోతాయి.

ఇప్పుడు ఓజీ సినిమా ప్రీమియర్‌ షో టిక్కెట్ల రేట్లు కూడా సినిమాకు ఉన్న క్రేజ్‌ దృష్ట్యా ఆకాశాన్ని అంటుతున్నాయి. రూ.2500 నుంచి రూ.3000 వరకు అఫీషియల్‌గానే అమ్ముతున్నారు. పవన్‌కల్యాణ్‌ అభిమానులు ఈ సినిమా విడుదలను ఓ పండగలా సెలబ్రేట్‌ చేస్తున్నారు.