Digital Book : ఏపీ మాజీ సీఎం, వైసీపీ చీఫ్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కార్యకర్తల ఫిర్యాదు కోసం వైసీపీ డిజిటల్ బుక్ యాప్‌ను బుధవారం లాంచ్ చేశారు. తాడేపల్లిలో జరిగిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో జగన్ ఈ యాప్‌ను ఆవిష్కరించారు. అన్యాయానికి గురవుతున్న కార్యకర్తల కోసం దీన్ని తీసుకొచ్చామని జగన్ వెల్లడించారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఈ ఫిర్యాదులన్నింటిపై విచారణ జరిపిస్తామన్నారు. అన్యాయం చేసిన వారు ఎక్కడున్నా సరే.. తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతానని జగన్ హామీ ఇచ్చారు. ఈరోజు వారు రెడ్‌బుక్ అంటున్నారు. రేపు మనం డిజిటల్ బుక్ ఏమిటన్నది చూపిస్తామన్నారు జగన్.
Digital Book : వైసీపీ చీఫ్ జగన్ కీలక నిర్ణయం
