Meesaala Pilla : మీసాల పిల్లా అంటూ నయన్ వెంట చిరు!

Meesaala Pilla : నవ్వించడంలోనే కాదు ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందించడంలోనూ  దర్శకుడు అనిల్ రావిపూడి ముందుంటున్నారు. సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో గోదారి గట్టుపై అంటూ రమణగోగుల గాత్రంతో ప్రేక్షకులను కట్టిపడేసాడు. తాజాగా చిరంజీవితో చేస్తున్న మన శంకరవరప్రసాద్ కోసం.. లెజండ్రీ సింగర్ ఉదిత్ నారాయణ్ గొంతును…చాలా కాలం తర్వాత తెలుగు ప్రేక్షకులకు వినిపిస్తున్నారు.

భీమ్స్ సంగీత సారథ్యంలో మీసాల పిల్లా అంటూ సాగే పాటను ఉదిత్ నారాయణ్ ఆలపించారు. దసరా పండుగ సందర్భంగా మెగా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతూ అనిల్ రావిపూడి మీసాల పిల్లా పాట ప్రోమోను విడుదల చేశారు. ఈ పాటలో చిరంజీవి గ్రేస్ చూస్తుంటే ఈ పాట కూడా రికార్డు స్థాయిలో శ్రోతలకు చేరువయ్యేలా కనిపిస్తోంది.ఈ పాట ఎలా ఉందో చూసేయండి.