BIG BREAKING : మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన నిర్ణయం!

BIG BREAKING : కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి నుంచి తన భార్య నిర్మల బరిలో ఉంటారని ఆమెనే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని అన్నారు. సంగారెడ్డిలో జరిగిన దసరా వేడుకల్లో జగ్గారెడ్డి ఈ కామెంట్స్ చేశారు.

అలా అని తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు కాదన్నారు జగ్గారెడ్డి. తనను సంగారెడ్డి నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని, మరో పదేళ్ల తరువాత తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. మధ్యలో ఎవరైనా రావొచ్చన్నారు. ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని ముందే తాను చెబుతున్నానని అన్నారు. జగ్గారెడ్డి చేసిన ఈ కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు సంచలనంగా మారాయి.

ఇక జగ్గారెడ్డి పొలిటికల్ లైఫ్ చూసుకుంటే ఆయన బీజేపీ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. 1986లో సంగారెడ్డి మున్సిపాలిటీకి కౌన్సిలర్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు జగ్గారెడ్డి. 2004లో టీఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు.

2014లో లోక్‌సభ ఉప-ఎన్నికల కోసం మళ్ళీ బీజేపీలో చేరి ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. 2015లో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2021, జూన్ 28 నుండి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు. జగ్గారెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో తనదైన ఫైర్ బ్రాండ్ లీడర్ గా ఫేమస్ అయ్యారు.