Kamareddy : కామారెడ్డిలో కత్తిపోట్ల కలకలం.. ఐదుగురు స్పాట్లో

Kamareddy: కామారెడ్డిలో కత్తిపోట్ల కలకలం రేపింది. శాస్త్రి ఆదర్శ సంఘం దుర్గామాత మండపం వద్ద ఓ విషయంలో.. రెండు గ్రూపులకు చెందిన యువకులు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో యువకులు ఒకరిపై ఒకరు కత్తులతో పరస్పరం దాడి చేసుకున్నారు. యువకులు దాడి చేసుకోవడంతో… పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని… గుమిగూడిన యువకులను చెదరగొట్టారు. ఈ దాడిలో ఐదుగురు యువకులకు గాయాలయ్యాయి. వెంటనే వీరిని చికిత్స నిమిత్తం… కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. గాయపడిన వారు కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రాహుల్, మణిరాజ్, మణికంఠ… కిరణ్, బాలాజీలుగా గుర్తించారు. ఈ మేరకు కామారెడ్డి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని… దర్యాప్తు చేస్తున్నారు.