ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. క్రాకర్స్ తయారీ యూనిట్‌లో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.
రాయవరం మండలం, వి. సావరం గ్రామంలోని లక్ష్మీ గణపతి ఫైర్ వర్క్స్ అనే లైసెన్స్ పొందిన క్రాకర్స్ తయారీ యూనిట్‌లో ఈ ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు స్పాట్ లోనే చనిపోగా, ఇద్దరు గాయపడ్డారు. మరణించిన వారి మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి.
ఈ ఘటన బుధవారం (అక్టోబర్ 8, 2025) మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో జరిగింది. గాయపడిన వారిని కాకినాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనపైన సీఎం చంద్రబాబు నాయుడు ఈ సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులను సంఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని మరియు గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అలాగే గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ కూడా సంతాపం వ్యక్తం చేశారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాద ఘటన కలిచివేసింది. ఈ ఘోర ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆవేదన కలిగించింది. ప్రమాద కారణాలు, ప్రస్తుత పరిస్థితి, సహాయక చర్యలు, వైద్య సాయంపై అధికారులతో మాట్లాడాను. స్వయంగా సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక…
— N Chandrababu Naidu (@ncbn) October 8, 2025