PM Modi : మోదీని కలిసిన అమెరికా రాయబారి సెర్గియా గోర్

PM Modi : భారత్ తో బంధాన్ని అమెరికా ఎంతో విలువైనదిగా భావిస్తోందని ఆ దేశ రాయబారి సెర్గియో గోర్ చెప్పారు. 6 రోజుల భారత పర్యటనలో ఉన్న ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. రక్షణ, వాణిజ్యం, సాంకేతికత వంటి ద్వైపాక్షిక అంశాలు సహా కీలక ఖనిజాల ప్రాముఖ్యతపైనా చర్చించామని తెలిపారు. విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ , జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్,విదేశాంగ కార్యదర్శి మిస్రీతోనూ వరుస సమావేశాలు నిర్వహించానని వివరించారు.

ప్రధాని మోదీని..అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అత్యంత సన్నిహితుడిగా భావిస్తారని సెర్గియో గోర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మోదీ, ట్రంప్ లతో కూడిన ఓ ఫొటోను ప్రధానికి బహూకరించారు. ఈ భేటీపై ప్రధాని కూడా స్పందించారు. భారత్ లో.. అమెరికా రాయబారిగా నియమితులైన సెర్గియో గోర్ తో భేటీ కావడం సంతోషంగా ఉందన్నారు. గోర్ హయాంలో భారత్ -అమెరికాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.