Konda vs CM : రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద బుధవారం అర్ధరాత్రి హైడ్రామా జరిగింది. మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)సుమంత్ ను అవినీతి ఆరోపణ నేపథ్యంలో ప్రభుత్వం విధుల నుంచి ప్రభుత్వం తొలగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడిని అరెస్ట్ చేయడానికి వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం అర్ధరాత్రి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న మంత్రి నివాసానికి మఫ్టీలో వచ్చారు.
🟥NEW SENSE #Hyderabad#Sumanth #Corrupted #TaskForce
— NEW SENSE (@Shyamsundarak6) October 16, 2025
…..
అధికారపార్టీలో దుమారం…
మంత్రి కొండా సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు
మా ఇంటికి ఎందుకొచ్చారు అంటూ పోలీసులతో గొడవకు దిగిన కొండా సురేఖ కూతురు కొండ సుస్మిత..!
కొండా సురేఖ ప్రైవేట్ ఓఎస్డీ సుమంత్ కోసం నిన్నటి… pic.twitter.com/WHqXY3lanJ
దీంతో వారిని కొండా సుస్మిత అడ్డుకున్నారు. మఫ్టీలో ఉన్న పోలీసులను అడ్డుకున్న ఆమె వారిని ఇంట్లోకి అనుమతించబోమని తేల్చి చెప్పారు. సుమంత్‌ను అడ్డుపెట్టుకుని తన తల్లి కొండా సురేఖను టార్గెట్ చేయడానికి, అరెస్ట్ చేయడానికి వచ్చారని ఆమె ఆరోపించారు. ఈ క్రమంలో ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కొండా సుస్మిత నేరుగా సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా, కొందరు రెడ్డి మంత్రులపై తీవ్ర ఆరోపణలు చేశారు.
బీసీ మంత్రి అని చూడకుండా తన తల్లిపై కుట్రలు చేస్తున్నారని, మంత్రి పదవి నుంచి తొలగించాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డిల ప్రమేయం ఉందని ఆమె బహిరంగంగానే ఆరోపించారు. తమ కుటుంబాన్ని రెడ్లందరూ కలిసి టార్గెట్ చేశారని, బీసీలను తొక్కుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వంలో పొంగులేటి ఫైల్స్ త్వరగా క్లియర్ అవుతున్నాయని, తమ ఫైల్స్ మాత్రం ఎందుకు పెండింగ్ లో పెడుతున్నారని సుస్మిత ప్రశ్నించారు.
ఎవడొచ్చిన,ఎంతమంది పోలీసులు వచ్చినా నన్నేం పీకలేరు అనీ పోలీసులకు సవాల్ విసిరిన మంత్రి కొండా సురేఖ కూతురు pic.twitter.com/XtWWnwYfUJ
— SR🚩 (@SrGoud29) October 16, 2025
ఎవడొచ్చిన,ఎంతమంది పోలీసులు వచ్చినా తనను ఏం పీకలేరని సుస్మిత సవాల్ చేశారు. నిందితుడు సుమంత్‌ను పోలీసులు అరెస్ట్ చేయకుండా, కారులో ఎక్కించుకుని ఇంటి నుంచి తీసుకెళ్లిపోయింది మంత్రి కొండా సురేఖ. కాగా డెక్కన్ సిమెంట్స్ సంస్థ యాజమాన్యాన్ని గన్ పెట్టి బెదిరించాడని సుమంత్‌పై ఆరోపణలపై కూడా కొండా సుస్మిత కీలక కామెంట్స్ చేశారు.
డెక్కన్ సిమెంట్స్ సంస్థను బెదిరించమని సీఎం కార్యాలయం నుండే ఆదేశాలు వచ్చాయని బాంబు పెల్చారు. అసలు తాము ఏ పార్టీలో ఉన్నాము.తమ మీద ఎందుకు ఇంత కక్ష అంటూ పోలీసులపై మండిపడ్డారు కొండా సురేఖ కూతురు. మొత్తానికి బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ హైడ్రామా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.