BIG BREAKING : మంత్రి కొండా సురేఖ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. నిన్న అర్ధరాత్రి హైదరాబాద్ లోని ఆమె నివాసం వద్ద హైడ్రామా పెను సంచలనంగా మారింది. ఏకంగా టెండర్లు సెటిల్మెంట్ల పేర్లతో దోపిడీ జరుగుతుందని మంత్రి కొండా సురేఖ కూతురు కొండాసుష్మిత కామెంట్ చేయడం పెద్ద సంచలనాన్ని సృష్టించిందని చెప్పాలి.
ఏకంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా సీఎం అనుచరుడు రోహిన్ రెడ్డి దందాలు సీఎం బ్రదర్స్ కొండల్ రెడ్డి, తిరుపతిరెడ్డి గురించి రేవంత్ రెడ్డి అంతర్గత విషయాలు బహిరంగంగా మీడియా ముందు ప్రస్తావించారు కొండా సుష్మిత. ఈ క్రమంలో కొండా సురేఖపై రేవంత్ సర్కార్ సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆమెపై వేటు వేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
కాసేపట్లో మీడియా ముందుకు మంత్రి కొండా సురేఖ
— Telugu Scribe (@TeluguScribe) October 16, 2025
తన OSD సుమంత్ వివాదంపై, డెక్కన్ సిమెంట్ వివాదంపై స్పందించనున్న కొండా సురేఖ
ఇప్పటికే తనకేమీ సంబంధం లేదన్నట్లుగా మాట్లాడిన కొండా మురళి https://t.co/ziddJ6iG5A pic.twitter.com/ILmEqmpMxM
ఈరోజు జరిగే క్యాబినెట్ సమావేశంలో కొండ సురేఖ పై వేటు వేటు వేసే అంశంపై క్యాబినెట్ కీలకంగా చర్చించినున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ఇక మరికాసేపట్లో కొండా సురేఖ మీడియా ముందుకు రానున్నారు. తన మాజీ ఓఎస్డి సుమంత్ వివాదంపై, దక్కన్ సిమెంట్ వివాదంపై ఆమె స్పందించనున్నారు. ఆమె ఈ ప్రెస్ మీట్ లో ఎలాంటి వ్యాఖ్యలు చేయనున్నారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఇప్పటికే ఈ విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని కొండా సురేఖ భర్త కొండా మురళి స్పందించారు.
ఇక మేడారం జాతర పనుల టెండర్ల విషయంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఆధిపత్యం పెంచుతూ, కొండా సురేఖ నిర్వహించే దేవాదాయ శాఖకు కాకుండా ఆ పనుల పర్యవేక్షణ బాధ్యతలను ఆర్ & బీ (R&B) శాఖకు అప్పగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వెంటనే ఈ రికార్డులను రోడ్లు, భవనాల శాఖకు అప్పగించాలని ఆదేశించింది. ప్రస్తుతం ఉన్న దశ నుంచి పనులను స్వాధీనం చేసుకోవాలని రోడ్లు-భవనాల శాఖకు సూచించింది.