Srikakulam : పెళ్లైన ఐదు నెలలకే ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న విషాదకరమైన ఘటన శ్రీకాకుళం జిల్లా.. పాతపట్నం మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై జగన్మోహన్‌రావు వెల్లడించిన వివరాల ప్రకారం .. పాతపట్నం మండలం తిడ్డిమి గ్రామానికి చెందిన శిరీష(23)కు అదే గ్రామానికి చెందిన ఏనుగుతల ప్రదీప్ కుమార్‌తో ఈ ఏడాది మే నెలలో పెళ్లి అయింది.
భర్త, అత్త వేధింపులు తాళలేక చనిపోతున్నానని ఓ వివాహిత లేఖ రాసి ఆత్మహత్య
పాతపట్నం మండలం తిడ్డిమి గ్రామానికి చెందిన శిరీష(23)కు అదే గ్రామానికి చెందిన ఏనుగుతల ప్రదీప్‌కుమార్‌తో ఈ ఏడాది మే నెలలో వివాహం#srikakulam #AndhraPradesh pic.twitter.com/ddo4S3uFOd— kotlata (@kotlataweb) October 17, 2025
పెళ్లాయ్యాక ఈ జంట తొండంగి మండలం గోపాలపట్నం వచ్చి రెంట్ కు తీసుకుని నివాసం ఉంటున్నారు. దివీస్ కంపెనీలోప్రదీప్ జాబ్ చేస్తున్నాడు. అయితే శిరీష మరోకరితో టచ్ లో ఉంటూ చాటింగ్ చేస్తోందటూ నెల రోజుల నుంచి భర్త ప్రదీప్ కుమార్, ఆమె అత్త తరచూ వేధిస్తున్నారు. దీంతో తన తండ్రి బుద్ధుడుకి శిరీష ఫోన్ చేసి తనను కొడుతున్నారని, వేధింపులు భరించలేకపోతున్నానని చెబుతూ వాపోయింది శిరీష.
అనంతరం తన తండ్రి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. దీంతో ఏం జరిగిందో అని తెలుసుకోడానికి అదే రోజు రాత్రి ఆయన గోపాలపట్నం వచ్చాడు. అయితే అప్పటికే ఆమె ఇంట్లో ఉన్న ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పక్కన ‘నా చావుకి కారణం నా అత్త నాగమ్మ, నా భర్త ప్రదీప్‌కుమార్’ అని ఓ సూసైడ్ నోట్ రాసి ఉంది.
బుద్ధుడు ఫిర్యాదు మేరకు ఎస్సై జగన్‌మోహనరావు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గురువారం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేస్తామన్నారు ఎస్సై.