BIG BREAKING : మరో బాంబ్ పేల్చిన రాజగోపాల్ రెడ్డి!

Komatireddy Raj Gopal Reddy

BIG BREAKING  :  సొంత పార్టీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పార్టీని కాపాడేందుకు ఆస్తులు అమ్ముకున్నాను కానీ పార్టీ తనను మోసం చేసిందన్నారు. బీఆర్ఎస్ నుండి వచ్చిన నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారని మండిపడ్డారు. తనతో పాటు బీజేపీ నుండి వచ్చిన వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఇచ్చారు, అతని కుమారుడికి ఎంపీ టికెట్ ఇచ్చారు..తనను మాత్రం పక్కన పెట్టారని ఫైరయ్యారు.

పార్టీ కోసం ఆస్తులు అమ్ముకుని కష్టపడిన తనని, కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, మంత్రి పదవి ఇస్తామని మాటిచ్చి మోసానికి పాల్పడిందన్నారు. తనకు మంత్రి పదవి రాకుండా కొందరు నాయకులు అడ్డుకుంటున్నారంటూ రాజగోపాల్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

“జన్మతః నేను కాంగ్రెస్ పార్టీ. పుట్టిన నాటి నుంచి నా రక్తంలోనే కాంగ్రెస్ పార్టీ ఉంది. పార్టీలోనే ఉంటా. ఆస్తులు అమ్ముకుని పార్టీని బ్రతికించడానికి పనిచేశాను” అంటూ భావోద్వేగ ప్రకటన చేశారు. పార్టీ కోసం ఇంతగా కష్టపడినా తనకు దశాబ్దాలుగా అన్యాయం జరిగిందని, మునుగోడులో అభివృద్ధి జరగకుండా అన్యాయం జరుగుతూనే ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన ఎక్సైజ్ పాలసీపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుకునేలా లిక్కర్ సిండికేట్లు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారుు, బెల్ట్ షాపులను పెంచి పోషిస్తున్నారని ఫైరయ్యారు. తన నియోజకవర్గంలో వైన్ షాపులకు కొన్ని కఠిన నిబంధనలు అమలు చేస్తానని కోమటిరెడ్డి ప్రకటించారు.