Pragya Thakur: అమ్మాయిల కాళ్ళు విరగ్గొట్టండి… బీజేపీ నేత సంచలన కామెంట్స్!

Pragya Thakur

Pragya Thakur:  భోపాల్ మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ తరచుగా సంచలన కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆమె మరోసారి సంచలన ప్రకటన చేశారు. లవ్ జిహాద్ గురించి ఆమె ఓ సభలో మాట్లాడుతూ.. మీ కూతురు మీ మాట వినకుండా హిందూయేతర( మరో మతస్థుడితో) వ్యక్తితో పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తే, ఆమె కాళ్ళు విరగ్గొట్టడానికి వెనుకాడకండి అంటూ చెప్పారు.

ఇతర మతస్థులను తమ ఇష్టానుసారంగా వివాహం చేసుకునే అమ్మాయిలను కంట్రోల్ లో పెట్టుకోవాలని తల్లిదండ్రులకు ఆమె సలహా ఇచ్చారు. కుమార్తెలకు మొదటి నుంచీ మంచి విలువలు నేర్పించాలని, ఒకవేళ వారు మాట వినకపోతే, తల్లిదండ్రులు మరింత కఠినంగా వ్యవహరించలన్నారు. మీ కూతురు భవిష్యత్తు కోసం ఆమెను కొట్టాల్సి వస్తే వెనక్కి తగ్గవద్దన్నారు.

హింసించిన తప్పులేదు

ఒక కూతురు పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఆమెను లక్ష్మీ, సరస్వతి రూపంగా భావిస్తారని, కానీ అదే కూతురు పెరిగి పెద్దయ్యాక మరో మతస్థుడిని కావాలని అనుకున్నప్పుడు ఆమెను ఆపడం అవసరమని అన్నారు. అలాంటి అమ్మాయిలను నిఘాలో ఉంచాలని, మంచి భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ విధంగా హింసించిన తప్పులేదన్నారు.

అలాంటి అమ్మాయిలను కొట్టి గుణపాఠం చెప్పడం మంచిదని చెప్పుకొచ్చారు. సాధ్వి ప్రగ్య చేసిన ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది బీజేపీ నాయకురాలు ఇలాంటి వివాదాస్పద ప్రకటన చేయడం ఇదే మొదటిసారి కాదు. ఆమె గతంలో చాలాసార్లు వార్తల్లో నిలిచింది, తరచుగా వివాదాస్పద ప్రకటనలు చేస్తూ బీజేపీని పలుమార్లు ఇబ్బందుల్లో పడేసింది.

Also Read :