ఓవైసీ నువ్వో సైతాన్‌.. ఉతికారేసిన BRS ఎమ్మెల్యే!

BRS

BRS : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏఐఎంఐఎం పార్టీ పోటీ చేయడం లేదు. కాంగ్రెస్ అభ్యర్థి వల్లాల నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేసిన తర్వాత, ఎంపీ, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్వయంగా ఆయన్ని కలిసి మద్దతు తెలిపారు. ఈ క్రమంలో ఓవైసీపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

అసదుద్దీన్ ఓవైసీకి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఓ సైతాన్‌లా, ఎన్నికల తర్వాత భగవాన్‌లా కనపడుతున్నాడా అని ప్రశ్నించారు. ఒకప్పుడు రేవంత్ రెడ్డిని RSS టిల్లు అన్న అసదుద్దీన్ ఓవైసీ ఇప్పుడు ఎలా మద్దతు ఇస్తున్నాడని నిలదీశారు.

కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శమని అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ ఆన్ రికార్డు సాక్షిగా అన్నారని, ఇప్పుడు జూబ్లీహిల్స్ అభివృద్ధి చెందలేదని, కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారని మండిపడ్డారు. ఓవైసీ బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పోటీగా అభ్యర్థులను పెట్టి, జూబ్లీహిల్స్‌లో మద్దతు ఇస్తున్నారని ఫైరయ్యారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అభ్యర్థిని పోటీ పెట్టకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడంపై ఎంఐఎం పార్టీ సిద్దాంతం ఏంటో తెలియదు అంటూ.. ఆ పార్టీ వైఖరిని ముస్లింలు ప్రశ్నిస్తున్నారని చెప్పారు.

కాగా జూబ్లీహిల్స్ బైపోల్ లోబీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు చీలకుండా చూడాలని, తద్వారా బీజేపీ విజయాన్ని అడ్డుకోవాలని ఎంఐఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓవైసీ తెలిపారు. జూబ్లీహిల్స్‌లో ముస్లిం ఓటర్లు సుమారు 30 శాతం వరకు ఉండటంతో, ఎంఐఎం మద్దతు కాంగ్రెస్ అభ్యర్థి విజయవకాశాలను గణనీయంగా పెంచే అవకాశం ఉంది. ఈ మద్దతుతో, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక ప్రతిష్ఠాత్మక పోరుగా మారింది.