Srija Dammu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్ దమ్ము శ్రీజ ఇన్స్టాగ్రామ్ ద్వారా సంచలన వీడియోను బయటపెట్టింది. ఎలిమినేషన్ నుంచి తానింక కోలుకోలేదని కన్నీళ్లు పెట్టుకుంది. ఎలిమినేషన్ నుంచి బయటకు వచ్చాక తాను ఇప్పటివరకు మళ్లీ బిగ్ బాస్ ఎపిసోడ్ ఒక్కటి కూడా చూడలేదని తెలిపింది. తాను దీపావళి సెలబ్రేషన్ టైమ్‌లో బిగ్ బాస్ హౌస్‌లో ఉంటే బాగుండేదని తెలిపింది. బిగ్‌బాస్ హౌస్‌ను, కంటెస్టెంట్ లను తాను చాలా మిస్ అవుతున్నానని శ్రీజ చెప్పింది.
బిగ్‌బాస్ కంటెస్టెంట్ దమ్ము శ్రీజ సంచలన వీడియో
ఎలిమినేషన్ నుంచి కోలుకోలేదని కన్నీళ్లు పెట్టుకున్న శ్రీజ#BiggBossTelugu #BiggBoss9 #Srijadammu #Biggbossupdates pic.twitter.com/NpSE0LQn56— kotlata (@kotlataweb) October 19, 2025
అగ్నిపరీక్షలో 5 లెవల్స్ దాటుకుని బిగ్‌బాస్ వరకు వెళ్లానని, బిగ్‌బాస్ కోసం ఒక పర్మినెంట్ ట్యాటూ కూడా వేయించుకున్నానని శ్రీజ చెప్పుకొచ్చింది. బిగ్‌బాస్ చరిత్రలోనే ఒక జర్నీ వీడియో లేకుండా.. బయటకు వచ్చేసిన కంటెస్టెంట్ తానే అంటూ శ్రీజ కన్నీళ్లు పెట్టుకుంది. హౌస్‌లోకి వచ్చినప్పటి నుంచి ఎలిమనేషన్ వరకు మోస్ట్ అన్ లక్కీని అని శ్రీజ వాపోయింది.
తాను ఎంతో కష్టపడ్డానని, 1000 పర్సెంట్ ఎఫర్ట్ ఇస్తూనే వచ్చానని శ్రీజ తెలిపింది. ప్రతీ టాస్క్‌కి. హౌస్మేట్స్ సపోర్ట్ లేకపోవడం వల్లో ఏమో, మొత్తానికి లక్ అనేది కలిసిరాకపోవడం వల్లో తెలియదు కానీ ఆ సక్సెస్ అనేది వచ్చేది కాదని దమ్ము శ్రీజ వెల్లడించింది. ఈ షో కోసం తన జాబ్ కూడా వదులుకున్నానని శ్రీజ చెప్పడం గమనార్హం. ఈ ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు నువ్వు చాలా స్ట్రాంగ్ అమ్మాయివి, ఎంతోమందికి స్ఫూర్తి బాధపడకండి అని ధైర్యం చెబుతున్నారు.
కాగా బిగ్ బాస్ ఐదవ వారంలో దమ్ము శ్రీజడబుల్ ఎలిమినేషన్లో భాగంగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. అయితే ఆమె ఎలిమినేషన్ పై ప్రేక్షకుల, విశ్లేషకులు సోషల్ మీడియాలో విమర్శలు చేశారు. ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం కాకుండా, వైల్డ్ కార్డ్ ఎంట్రీల నిర్ణయం ఆధారంగా ఆమెను ఎలిమినేట్ చేయడం అన్యాయమని అభిప్రాయపడ్డారు. ఆమె రీఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బిగ్ బాస్ టీమ్ కూడా మెసేజులు పెడుతున్నారు.