Telangana : ఆయనో మాజీ ఎమ్మెల్యే.. అందులోనూ ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే.. ఎంత జాగ్రత్తగా, మర్యాదగా ఉండాలి.. అధికారంలో ఉంది మన పార్టీనే ఏం చేసిన నడుస్తుందులే అనుకున్నాడేమో పాపం.. పండగ పూట పేకాట ఆడుతూ పోలీసులకు అడ్డంగా బుక్కైపోయాడు.
ఈ సంఘటన వరంగల్ జిల్లాలో జరిగింది.ఆదివారం రాత్రి కొత్తవాడలోని మాజీ ఎమ్మెల్యే దోనెపూడి రమేశ్‌బాబుతో పాటుగా మరికొంతమంది పోలిటికల్ లీడర్లు కొంతమంది కలిసి పేకాడుతున్నట్లుగా పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో పోలీసులు ప్లాన్ తో రైడ్ చేశారు. మాజీ ఎమ్మెల్యేతో పాటుగా 13 మందిని అదుపులోకి తీసుకున్నారు.
పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కిన కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే దోనెపూడి రమేశ్‌బాబు
వరంగల్ జిల్లా మట్టెవాడ పీఎస్ పరిధిలో ఇంట్లో పేకాట ఆడుతూ పట్టుబడ్డ దోనెపూడి రమేశ్‌బాబు.. రూ.3.68 లక్షలు, 15 ఫోన్లు స్వాధీనం
పక్కా సమాచారంతో దాడి చేసి 13 మందిని అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్… pic.twitter.com/OtSShpsidf
— Telugu Scribe (@TeluguScribe) October 20, 2025
పోలీసులకు పట్టుబడిన వారిలో మాజీ ఎమ్మెల్యే దోనెపూడి రమేశ్‌బాబుతో పాటుగా వరంగల్ ఏరియాకు చెందిన గూడూరు హరిబాబు, కాజీపేట ప్రాంతానికి చెందిన వలుపదాసు సదానందం, పుట్ట మోహన్‌రెడ్డి, హంటర్‌రోడ్డు శాయంపేట ప్రాంతానికి చెందిన మాజీ కార్పొరేటర్ మాడిశెట్టి శివశంకర్, మామునూరు ప్రాంతానికి చెందిన నోముల తిరుపతిరెడ్డి, గిర్మాజీపేట ప్రాంతానికి చెందిన రావర్ల శ్రీనివాసరావు, సయ్యద్ జావీద్, కొత్తవాడకు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు నీలం రాజ్‌కిశోర్ తో పాటుగా తదితరులు ఉన్నారు.
వారి నుంచి రూ.3,68,530 క్యాష్ 15 సెల్ఫోన్లు, కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు పట్టుబడిన వారిలో చింతం సంతోష్‌పై గతంలో పేకాట శిబిరాలు నిర్వహించినట్లుగా ఆరోపణలున్నాయి.