లవ్‌ కంటెంట్‌ కోసమే వచ్చావే నువ్వు.. రీతూ పరువు తీసిన అయేషా..BIGG BOSS రచ్చ రచ్చ!

Rithu Chowdary

BIGG BOSS  : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 చాలా ఉత్కంఠగా సాగుతోంది. టాప్‌ కంటెస్టెంట్ అనుకున్న భరణి ఎలిమినేటేడ్‌ అయ్యాడు. ఇక ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ చాలా వేడిగా జరిగింది. ఇంటి సభ్యులు ఇద్దరిని ఎంచుకుని, నామినేట్ చేయడానికి గల కారణాలను చాలా ఘాటుగా చెప్పారు. నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా కంటెస్టెంట్‌లు ఏకంగా వ్యక్తిగత విమర్శలకు దిగడంతో హౌస్ రణరంగగా మారింది. ముఖ్యంగా కొందరు వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్‌లు మిగిలిన హౌస్‌మేట్స్‌ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ కు దిగారు.

వైల్డ్‌కార్డ్‌ అయేషా, రీతూ మధ్య మాటల యుద్ధం నడించదనే చెప్పాలి. లవ్‌ కంటెంట్‌ కోసమే వచ్చావంటూ రీతూని డైరెక్ట్‌ నామినేట్‌ చేసింది అయేషా. దీంతో అయేషా చేసిన వ్యాఖ్యలు గొడవకు దారితీశాయి. ఒకరినొకరు మాటల యుద్దానికి దిగారు. పోవే అంటూ మాటల హద్దులు దాటారు. నేను చెప్పానా లవ్ చేస్తున్నాను లవ్ చేసి తిరుగుతున్నాను అని.. అని రీతూ సూటిగా అడిగింది. నెక్స్ట్ రీతూ వచ్చి అయేషాని ముందుగా నామినేట్ చేసింది.

ఇక తనూజని చిట్టి పికిల్స్‌ ఫేమ్ రమ్య మోక్ష నామినేట్‌ చేసింది. ఇంట్లో యాక్టింగ్‌ చేస్తున్నారంటూ స్టేట్‌మెంట్ ఇచ్చింది రమ్య. నువ్వో ఫేక్ అంటూ కామెంట్ చేసింది. అంతేకాకుండా వయసు పెరిగింది కానీ, బుద్ధి పెరగలేదంటూ తనూజపై రమ్య మండిపడింది. అటు కళ్యాణ్, శ్రీనివాస్ సాయి మధ్య కూడా మాటల యుద్ధం జరిగింది.

అయితే కెప్టెన్‌గా ఉన్న కంటెస్టెంట్ గౌరవ్.. ఈ వారం నామినేట్ చేయబడిన వారిలో నుంచి ఒకరిని తన ప్రత్యేక అధికారాన్ని ఉపయోగించి సేవ్ చేసుకునే అవకాశం వచ్చింది. దీంతో అతను అయేషాను సేవ్ చేశాడు. అనంతరం నామినేషన్ ప్రక్రియ ముగిసింది. అనంతరం ఈ వారం ఎలిమినేషన్‌లో ఉన్న కంటెస్టెంట్‌ల తుది జాబితాను బిగ్‌బాస్ వెల్లడించాడు. మొత్తంగా చూసుకుంటే నిన్నటి ఎపిసోడ్ నామినేషన్లలోని వ్యక్తిగత టార్గెటింగ్ గానే నామినేషన్స్ ప్రక్రియ నడించినట్లుగా కనిపించి ఉత్కంఠభరితంగా సాగింది.