BIG BREAKING : భారీ ఎన్‌కౌంటర్ .. మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు హతం

BIG BREAKING

BIG BREAKING : ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో బుధవారం రాత్రి జరిగిన హైవోల్టేజ్ ఎన్‌కౌంటర్‌లో బీహార్‌లోని నలుగురు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు హతమయ్యారు. ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్, బీహార్ పోలీసుల సంయుక్తగాబహదూర్ షా మార్గ్‌లో ఈ ఆపరేషన్ నిర్వహించింది. రాత్రి 2:20 గంటలకు నలుగురు గ్యాంగ్‌స్టర్లు, పోలీసులకు మధ్య తీవ్రమైన కాల్పులు జరపారు. ఈ క్రమంలో గ్యాంగ్‌స్టర్లను పోలీసులు అంతమొందించారు. గ్యాంగ్‌స్టర్ల డెడ్ బాడీలను వెంటనే రోహిణిలోని డాక్టర్ బిఎస్‌ఎ ఆసుపత్రికి తరలించారు.

హత్యకు గురైన నలుగురు గ్యాంగ్‌స్టర్లు బీహార్‌లోని క్రూరమైన సిగ్మా అండ్ కంపెనీ ముఠా సభ్యులు. వారిని రంజన్ పాఠక్ (25), బిమలేష్ మహాతో (25), మనీష్ పాఠక్ (33), అమన్ ఠాకూర్ (21) గా గుర్తించారు. రంజన్, బిమలేష్, మనీష్ బీహార్‌లోని సీతామర్హి జిల్లా నివాసితులు కాగా, అమన్ ఠాకూర్ ఢిల్లీలోని కరావాల్ నగర్ నివాసి. పోలీసుల ప్రకారం, ఈ ముఠా బీహార్, నేపాల్‌లో అనేక తీవ్రమైన నేర సంఘటనలకు పాల్పడింది. ఆ ముఠా నాయకుడు రంజన్ పాఠక్.

ఢిల్లీ, బీహార్ పోలీసులు చాలా కాలంగా ఈ ముఠా కోసం వెతుకుతున్నారు. అనేక తీవ్రమైన కేసుల్లో వాంటెడ్ గా ఉన్న ఈ ముఠాపై రెండు రాష్ట్రాల పోలీసులు నిఘా పెట్టారు. ఖచ్చితమైన నిఘాతో ఈ ఉమ్మడి ఆపరేషన్ నిర్వహించారు.ఈ ఎన్‌కౌంటర్ సమయంలో ముఠా మొదట కాల్పులు జరిపారని. దీంతో తామ కూడా కాల్పులు చేయాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ నలుగురు బీహార్ ఎన్నికలకు ముందు పెద్ద కుట్ర చేయాలని ప్లాన్ చేశారని పోలీసులు అంటున్నారు.