Virat Kohli : కోహ్లీ గుడ్‌బై! .. చివరి మ్యాచ్ ఆడేసిన కింగ్.. VIDEO VIRAL

Virat Kohli

Virat Kohli : అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న రెండో వన్డేలో విరాట్ కోహ్లీ ఖాతా తెరవకుండానే మరోసారిపెవిలియన్ చేరాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్ కెరీర్‌లో కోహ్లీ ఇలా వరుసగా రెండు మ్యాచ్‌లలో డకౌట్ కావడం ఇదే తొలిసారి. పెర్త్‌లో జరిగిన తొలి వన్డేలో డకౌట్ అయిన కోహ్లీ, అడిలైడ్‌లో కూడా రెండో వన్డేలోనూ నాలుగు బంతులు మాత్రమే ఎదరుకుని ఎల్బీ రూపంలో సున్నా పరుగులకే ఔటయ్యాడు.దీంతో ఇప్పుడు కోహ్లీ వన్డే కెరీర్‌పై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో కోహ్లీ చేసిన వీడ్కోలు సంజ్ఞ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.

ఇప్పటికే టీ20, టెస్ట్ క్రికెట్‌లకు గుడ్ బై పలికిన కోహ్లీ, త్వరలోనే వన్డే క్రికెట్‌కు కూడా రిటైర్మెంట్ చెప్పబోతున్నాడని అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఆస్ట్రేలియా పర్యటన కోహ్లీకి చివరి వన్డే సిరీస్ కావచ్చనే ఊహాగానాలు జోరుగా నడుస్తున్నాయి. సాధారణంగా మైలురాళ్ళు లేదా చివరి మ్యాచ్‌ల సమయంలోనే ఆటగాళ్లు ఇలా వీడ్కోలు చెబుతుంటారు. సరిగ్గా కోహ్లీ వీడ్కోలు సంజ్ఞ అలాగే ఉంది. ఔట్ అయిన తరువాత పెవిలియన్ కు వెళ్తుండగా కోహ్లీ అడిలైడ్ ప్రేక్షకులకు వీడ్కోలు చెప్పిన తీరుతో.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా? అనే ఊహాగానాలు ఒక్కసారిగా పెరిగాయి.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.దీంతో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (9 పరుగులు), విరాట్ కోహ్లీ (0 పరుగులు – డకౌట్) త్వరగా పెవిలియన్ చేరారు. కష్టాల్లో పడినప్పటికీ, రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా ఆడి జట్టును ఆదుకుంటున్నారు. ఇద్దరు హాఫ్ సెంచరీలు చేశారు. 27 ఓవర్ల ఆట ముగిసిన తర్వాత భారత్ 122/2గా ఉంది.