BIG BREAKING : బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం సంచలన కామెంట్స్

ponnam Prabhakar

BIG BREAKING : కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాదంపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు..తనిఖీలు లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మంత్రి అభిప్రాయపడ్డారు. బస్సులను రోజూ తనిఖీ చేస్తుంటే వేధింపులు అంటున్నా్రంటూ మంత్రి చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై తాను ఏపీ రవాణా శాఖ మంత్రి, కర్నూలు జిల్లా కలెక్టర్‌ సిరి, ఎస్పీలతో మాట్లాడానని పొన్నం అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని, త్వరలో ఏపీ, కర్ణాటక, తెలంగాణ రవాణా శాఖ కమిషనర్ల సమావేశం- ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పుకొచ్చారు.

కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాదం ఘటనలో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం.. కర్నూలు కలెక్టరేట్ లోని కంట్రోల్ రూమ్ నం. 08518-277305, కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కంట్రోల్ రూమ్ నం. 9121101059, ఘటనా స్థలి వద్ద కంట్రోల్ రూమ్ నం. 9121101061, కర్నూలు పోలీస్ ఆఫీసు కంట్రోల్ రూమ్ నం. 9121101075, కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి హెల్ప్ డెస్క్ నంబర్లు: 9494609814, 9052951010 ఏర్పాటు చేశారు.

కర్నూలు జిల్లాలో మంటలు చెలరేగి వి కావేరి ట్రావెల్స్‌ బస్సు దగ్ధం అయింది. బైక్‌ను బస్సు ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాద ఘటననలో పలువురు ప్రయాణికులు సజీవదహనమయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున 03 గంటల ప్రాంతంలో కల్లూరు మండలం చిన్నటేకూరు దగ్గర ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎమర్జెన్సీ డోర్‌ నుంచి 12 మంది ప్రయాణికులు బయటపడ్డారు. గాయపడిన వారిని కర్నూలు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన బస్సు నెంబర్‌ DD 01 N 9490. సమాచారం అందుకోగానే ఘటనాస్థలానికి పోలీసులు, ఫైర్‌ సిబ్బంది చేరుకున్నారు. అగ్నిప్రమాదంతో హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.