Bus Accident : కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది. కర్నూలు శివారు ప్రాంతం, చిన్న టేకూరు సమీపంలో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వీ-కావేరీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఘోర అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 19మంది సజీవ దహనం అయ్యారు. కనీసం కుటుంబ సభ్యులు కూడా తమవారిని చివరి చూపు చూసుకోకుండా డెడ్ బాడీలు దారుణంగా మిగిలిపోయాయి.
గురువారం రాత్రి 10:30 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరిన ఏసీ స్లీపర్ బస్సు శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కర్నూలు శివారుకు చేరుకుంది. అదే సమయంలో, బస్సు బైక్‌ను వేగంగా ఢీకొట్టింది. అయితే బైక్‌ను ఢీకొట్టిన తర్వాత కూడా డ్రైవర్ బస్సును ఆపకుండా సుమారు 300 మీటర్ల దూరం లాక్కెళ్లాడు. ఈ క్రమంలో బైక్ పెట్రోల్ ట్యాంక్ పగిలి, లీకైన పెట్రోల్‌కు బస్సు కింద ఘర్షణ వల్ల మంటలు అంటుకున్నాయి. ఆ మంటలు క్షణాల్లోనే బస్సు అంతటా వ్యాపించాయి. దీంతో అందులోనే కొందరు ప్రయాణికులు తప్పించుకుని బయటపడగా మరికొంతమంది అగ్నికి ఆహుతి అయిపోయారు.
అయితే బస్ ప్రమాదానికి ఓ రకంగా కారణమైన బైకర్ శివశంకర్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రమాదానికి 20 నిమిషాల ముందు శివశంకర్ తన ఫ్రెండ్ తో కలిసి ఓ పెట్రోల్ బంక్‌కు వెళ్లాడు. అక్కడ పెట్రోల్ కోసం చాలా సేపు ఆగాడు. పెట్రోల్ దొరకకపోవడంతో తిరిగి వెళ్లిపోయాడు. అంతేకాదు పెట్రోల్ బంక్‌లో బైక్‌తో విన్యాసాలు చేశాడు. ఒక్కచేతితో బైకును తిప్పేశాడు. దీంతో బైకర్ శివశంకర్ మద్యం మత్తులో ఉన్నాడా అనే అనుమానం నెలకొంది. బైక్‌ను ఢీ కొట్టడంతో వీకావేరి బస్సులో మంటలు చెలరేగాయి.
శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల 22 నిమిషాలకు పెట్రోల్ బంక్‌లో శివశంకర్ ఉండగా.. 2 గంటల 40 నిమిషాలకు ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు.ఈ వీడియోను మీరు కూడా చూడండి.
నిన్న బస్ ఫైర్ Accident కి కారణం అయిన వ్యక్తి.. మద్యం మత్తులో పెట్రోలు పంపు నుంచి వెళ్లిన cc footege.#kurnool #BusAccident pic.twitter.com/cUdZyx48yF
— kotlata (@kotlataweb) October 25, 2025
కర్నూలు మండలం ప్రజానగర్ కు చెందిన శివశంకర్ గ్రానైట్, పెయింటింగ్ పనులు చేసేవాడు. నిన్న తెల్లవారుజామున డోన్ నుంచి బయలుదేరి ఇంటికి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
